నరేష్ బన్సాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నరేష్ బన్సాల్
నరేష్ బన్సాల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 నవంబర్ 2020
ముందు రాజ్ బబ్బర్
నియోజకవర్గం ఉత్తరాఖండ్

ప్రధాన కార్యదర్శి (సంస్థ), భారతీయ జనతా పార్టీ, ఉత్తరాఖండ్
పదవీ కాలం
2002 – 2009
అధ్యక్షుడు * మనోహర్ కాంత్ ధ్యాని

వ్యక్తిగత వివరాలు

జననం 1955 (age 68–69)
డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం 3
వృత్తి బ్యాంకర్ , రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

నరేష్ బన్సాల్ డెహ్రాడూన్‌లో జన్మించాడు. ఆయన తన ప్రాథమిక విద్యను మునిసిపాలిటీ పాఠశాలలో, డీఏవీ కాలేజీలో ఎం.కామ్, నాగ్‌పూర్‌లో 'సంఘ' డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

నరేష్ బన్సాల్ ఎనిమిదేళ్ల వయసులో హిందూ జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో క్రియాశీల సభ్యునిగా చేరి 1972 నుండి 1974 వరకు విద్యార్థి మండలికి నగర కోశాధికారిగా, ఆర్‌ఎస్‌ఎస్‌లో వివిధ పదవులు నిర్వహించాడు. ఆయన 1977లో బన్సాల్ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) జిల్లా కోఆర్డినేటర్‌ ఆ తరువాత 1980 నుండి 1986 వరకు హిందూ జాగరణ్ మంచ్‌నగర అధ్యక్షుడిగా, 1989లో శ్రీరామ శిలా పూజా కమిటీకి నగర కన్వీనర్‌గా, రామ జన్మభూమి ఉద్యమ సమయంలో ఏర్పడిన ఉత్తరాఖండ్ సంవాద్ సమితికి శ్రీరామ్ కోశాధికారిగా పని చేశాడు.

నరేష్ బన్సాల్ ఆ తరువాత బీజేపీలో చేరి 2002 నుండి 2009 వరకు పూర్తికాల కార్యకర్తగా రాష్ట్ర ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా, 2009 నుండి 2012 వరకు బిజెపి జాతీయ కార్యవర్గానికి శాశ్వత ఆహ్వానిత సభ్యునిగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. నరేష్ బన్సాల్ 2012లో బన్సాల్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఆ తర్వాత తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు. ఆయన 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా, 2012 నుండి 2019 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]

నరేష్ బన్సాల్ 2 నవంబర్ 2020న ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

మార్చు
  1. The Times of India (28 October 2020). "BJP's Rajya Sabha candidate Naresh Bansal joined RSS at the age of eight". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  2. Amar Ujala. "राज्यसभा चुनाव 2020: मात्र आठ साल की उम्र में नरेश बंसल बने राष्ट्रीय स्वयं सेवक, जानिए उनके बारे में खास बातें..." Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  3. The Wire (2 November 2020). "BJP's Naresh Bansal Elected Unopposed To Rajya Sabha From Uttarakhand" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.