నర్వ మండలం
నర్వ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1]
నర్వ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, నర్వ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′01″N 77°41′08″E / 16.483498°N 77.685471°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నారాయణపేట జిల్లా |
మండల కేంద్రం | నర్వ |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 197 km² (76.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 49,359 |
- పురుషులు | 24,500 |
- స్త్రీలు | 24,859 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 34.01% |
- పురుషులు | 45.91% |
- స్త్రీలు | 22.20% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.మండలం మొత్తం గ్రామీణ ప్రాంతమే.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 49,359 - పురుషులు 24,500 - స్త్రీలు 24,859. అక్షరాస్యుల సంఖ్య 21104.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 197 చ.కి.మీ. కాగా, జనాభా 31,536. జనాభాలో పురుషులు 15,626 కాగా, స్త్రీల సంఖ్య 15,910. మండలంలో 6,221 గృహాలున్నాయి.[4]
మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పు
మార్చుగతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[5]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 February 2019. Retrieved 5 March 2019.