రోగశుశ్రూష

(నర్సింగు నుండి దారిమార్పు చెందింది)

నర్సింగ్ లేదా రోగశుశ్రూష అనేది జీవితం యొక్క ఆరోగ్యం, నాణ్యత సాధించడానికి, కాపాడేందుకు లేదా తిరిగి కోలుకొనేందుకు వ్యక్తుల, కుటుంబాల, సంఘాల యొక్క సంరక్షణపై దృష్టి పెట్టే ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఒక వృత్తి.

నర్సు
శిశువును జాగ్రత్తగా చూసుకుంటున్న ఒక బ్రిటిష్ నర్సు
వృత్తి
పేర్లునర్సు
వృత్తి రకం
ఆరోగ్య సంరక్షణ వృత్తి
కార్యాచరణ రంగములు
ఆరోగ్య సంరక్షణ
వివరణ
సామర్ధ్యాలురోగుల బాగోగుల కోసం వారిని శ్రద్ధగా చూసుకోవడం
విద్యార్హత
ఆయా దేశాల్లోని జాతీయ, రాష్ట్ర, లేదా ప్రాంతీయ చట్టాల అనుసరించి చట్టబద్ధమైన నిబంధనలు దృష్ట్యా అర్హతలు
ఉపాధి రంగములు
  • హాస్పిటల్
  • క్లినిక్
  • లాబరేటరీ

నర్సింగ్ చరిత్ర

మార్చు

గ్రీసులో వందల సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు దేవాలయాలకు వెళ్ళేవారు, అక్కడ పురుషులు, మహిళలు వారికి సహాయపడేవారు. వారు పువ్వులు, ఇతర వస్తువుల ద్వారా మందులు తయారు చేసేవారు.

క్రీ.పూ ఐదవ శతాబ్దంలో, సుమారు 2400 సంవత్సరాల క్రితం, గ్రీకులలో ఒకడైన హిప్పోక్రేట్స్ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతారు, వారిని బాగుచేయటం ఎలా అనే దానిపై ఆసక్తిని చూపించాడు. ఈయన 70కి పైగా పుస్తకాలను వ్రాశాడు, ఆరోగ్య సంరక్షణ అధ్యయనానికి సంబంధించి ప్రపంచంలోని మొదటి వ్యక్తులలో ఒకరు. అందుకే ఇతనిని తరచుగా "పశ్చిమ వైద్యశాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు.[1]

మతం కూడా నర్సింగ్ చరిత్రలో ముఖ్యమైనది. యేసు క్రీస్తు అనారోగ్య ప్రజలకు సహాయపడాలి అని బోధించాడు.[2] మధ్య యుగాలలో, క్రైస్తవ చర్చి మరిన్ని ఆసుపత్రులు తెరిచింది. ముస్లింలు బాగ్దాద్, డమాస్కస్ లో కొన్ని తెరిచారు. ముస్లిం ఆస్పత్రులు ఏ దేశం లేదా ఏ మతానికి చెందిన ప్రజలకైనా సహాయపడ్డాయి.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

ఫ్లోరెన్స్ నైటింగేల్ - ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఒక నర్సు

మూలాలు

మార్చు
  1. "Useful known and unknown views of the father of modern medicine". ncbi.nlm.nih.gov. Retrieved 18 December 2010.
  2. 2.0 2.1 Davies, Paul A. (2002). Nursing. Hong Kong: Oxfor University Press. ISBN 0-19-423293-X.