కింగ్ కోబ్రా

ప్రపంచములో అత్యంత పెద్ద మరియు పొడవైన విష సర్పము
(నల్ల త్రాచు నుండి దారిమార్పు చెందింది)


ప్రపంచములో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పములలో నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా (Ophiophagus hannah - జాతి/ప్రజాతి నామము) మొదటిది. ఇది నేల పైన జీవించగలిగే సర్పము. సాధారణంగా ఇది 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది. బరువు సుమారుగా 44 పౌండ్లు (8 కిలోలు) ఉంటుంది. ఆడపాము 20-40 గుడ్లను దిబ్బ మాదిరిగా పెట్టును. దీని జీవిత కాలం 20 సంవత్సరాలు. దీని విషము మెదడు మీద అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. దీని కాటు వలన మరణించే అవకాశం 75% వరకు ఉంది. దీనిని కోబ్రా అన్నప్పటికినీ ఇది "నాజ" ప్రజాతికి చెందదు. ఆహారముగా ఇతర పాములను, కొండ చిలువలను తింటుంది. అందువలన దీని జాతి పేరు "ఓఫియోఫేగస్ (Ophiophagus)" (గ్రీకు భాషలో ఓఫియోఫేగస్ అంటే పాములను తినేది అని అర్థము) గా గుర్తించబడింది. చూడడానికే భీతి గొలిపే ఈ పాము స్వభావ సిద్దముగా సిగ్గరి. సాధారణంగా ముఖాముఖి ఎవరి కంటబడానికి ఇష్ట పడదు.

రాచ నాగు
దస్త్రం:12 The Mystical King Cobra and Coffee Forests.jpg
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
Ophiophagus
Species:
O. hannah
Binomial name
Ophiophagus hannah
Range (in red)

ఇతర కోబ్రా జాతి పాముల వలెనే ఈ పాము కూడా తన పొడవులో మూడవ వంతు వరకు పడగ ఎత్తగలదు. ఎదుర్కొన దలచినప్పుడు ఈ పాము పడగ పైకెత్తి పెద్దగా బుస కొడుతుంది. బాగా ఎదిగిన కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే ఆరు అడుగుల ఎత్తుండి ఎదురుగా నిలిచిన మనిషి కళ్ళలోనికి ఉగ్రంగా చూస్తుంది.

నివాస ప్రదేశాలు

మార్చు

కింగ్ కోబ్రా భారత్, దక్షిణ చైనా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయ ఆసియా దేశాలలోని దట్టమైన అరణ్యాలలో జీవిస్తుంది. చుట్టూ సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇది నీటిలో బాగా ఈదగలదు. అడవులను విస్తారంగా నరికి వేయడముతో కొన్ని ప్రాంతాలలో ఈ పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ IUCN వారిచే ఇంకా అంతరించే ప్రమాదమున్న జీవిగా గుర్తింపబడలేదు.

ఈ జాతి పాములు ఆంధ్ర ప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు (ఈస్ట్రన్ గాట్స్) ఫారెస్ట్ లో కుడా ఉన్నాయి.

గుడ్లను పొదగడానికి గూడు కట్టే ఏకైక సర్పమిది. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో ఈ పామును "నాగరాజు"గా పూజిస్తారు. కేరళలో "నాయర్" అనబడే కులస్తులు ఈ పామును "కావు" అనే పేరుతో పూజిస్తారు.

వేట, ఆహారం, విషం

మార్చు

ఇతర పాముల వలెనే కింగ్ కోబ్రా కూడా తన నాలుక తోనే వాసన చూస్తుంది. ఇతర జీవుల నుండి వచ్చే వాసనను తనలోని ఘ్రాణేంద్రియాల ద్వారా (దీనిని జేకబ్సన్ అవయవం - Jacobson's Organ అంటారు) గ్రహిస్తుంది. ఏదైనా ఆహారం దగ్గరలో ఉన్నప్పుడు తన నాలుకను బయటకు, లోనికి పంపే చర్య ద్వారా ఆహారం ఎంత దూరంలో ఉందో పసిగడుతుంది. దీని దృష్టి నిశితమైనది. 100 మీటర్ల దూరంలోని ఆహారాన్ని కూడా చూడగలదు. మిగిలిన పాములతో పోలిస్తే ఇది బాగా తెలివైన పాము. కాటు వేసిన తరువాత ఆహారాన్ని ఒక్కసారిగా మింగేస్తుంది. అన్ని పాముల వలెనే కింగ్ కోబ్రా దవడలు కూడా మృదువైన సులువుగా వంగే బంధకాలతో (flexible ligaments) సంధానించబడి ఉంటాయి. దవడలు స్థిరంగా కలుపబడి ఉండవు. దీని కింది దవడలు, పై దవడలు వేటికవే విడి విడిగా కదులుతూ ఆహారాన్ని మింగడానికి తోడ్పడతాయి. దవడలు విడి విడిగా కదలడం వలన తన నోటి కన్నా పెద్దదైన ఆహారాన్ని తేలికగా లోనికి తీసుకొనగలుగుతుంది. దీని దవడల నిర్మాణం చాలా గట్టిగా ఉంటుంది.

కింగ్ కోబ్రాకు ముఖ్య ఆహారం ఇతర పాములే. ఎక్కువగా విషం లేని పాములను తినడానికి ఇష్టపడుతుంది. కానీ విషపు పాములను కూడా తింటుంది. చాలా అరుదుగా ఇతర కింగ్ కొబ్రాలను కూడా తింటుంది. తిండి కొరత ఏర్పడితే బల్లులను ఇతర చిన్న జీవులను కూడా తింటుంది. దీని జీర్ణ క్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఒకసారి భారీగా ఆహారాన్ని తీసుకుంటే, నెలల తరబడి ఆహారం లేకుండా ఉండగలదు. కింగ్ కోబ్రా పగటి పూట ఆహారం కోసం వేటాడుతుంది. అరుదుగా రాత్రి కూడా వేటాడుతుంది.

తనకు హాని కలిగించే జీవి ఏదైనా ఎదురైనప్పుడు (ముఖ్యంగా ముంగీస), కింగ్ కోబ్రా సాధారణంగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ అవకాశం లేనప్పుడు పడగ పైకెత్తి పెద్దగా బుస కొడుతూ బెదిరింపు కాటుకు ప్రయత్నిస్తుంది (తన విషం ముంగీస పైన ప్రభావం చూపదని తెలిసినప్పటికీ కూడా) .

కింగ్ కోబ్రా విషం ప్రోటీన్స్ తోనూ పాలిపెప్టైడ్స్ తోనూ తయారవుతుంది. ప్రత్యేక లాలాజల గ్రంథులలో ఇది తయారవుతుంది. ఈ విష గ్రంథులు కింగ్ కోబ్రా శరీరంలో కళ్ళకు వెనుక భాగంలో ఉంటాయి. కింగ్ కోబ్రా కోరలు 8 నుండి 10 మిల్లీ మీటర్ల పొడుగు ఉంటాయి. కాటు వేసినపుడు ఈ కోరల ద్వారా విషం జీవి శరీరం లోనికి ప్రవేశిస్తుంది. దీని విషం ఇతర పాముల కన్నా ప్రమాదకరమైనది కానప్పటికినీ, కాటు వేసినప్పుడు ఎక్కువ విషం ఎక్కుతుంది కాబట్టి, విష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది (గబూన్ వైపర్ అనే విష సర్పం మాత్రమే కాటు వేసినప్పుడు కింగ్ కోబ్రా కన్నా ఎక్కువ విషం ఎక్కించగలదు) . ఒక కాటుకు ఒక పెద్ద ఆసియన్ ఏనుగు చనిపోయేంత విషాన్ని కింగ్ కోబ్రా ఎక్కించగలదు.

కింగ్ కోబ్రా విషం శరీరం లోని నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విష ప్రభావం వలన దేహమంతా తీవ్రమైన నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. తరువాత కొన్ని నిముషాలలోనే గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. దీనివలన కాటు తగిలిన జీవి కొద్ది సేపటికే స్పృహ కోల్పోతుంది. శ్వాస తీసుకోవడం బాగా కష్టమవడం వల్ల త్వరగా మరణం సంభవిస్తుంది. ప్రస్తుతానికి రెండు కంపెనీలు కింగ్ కోబ్రా విషానికి విరుగుడు తయారు చేస్తున్నాయి. మొదటిది థాయ్‌లాండ్ లోని రెడ్ క్రాస్ సంస్థ, రెండవది సెంట్రల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియా. ఈ రెండు కంపెనీలు తక్కువగా ఉత్పత్తి చేయడం వలన ఈ మందులు అంత విస్తారంగా దొరకవు.

మూలాలు

మార్చు
  1. http://www.seanthomas.net/oldsite/danger.html
  2. http://www.priory.com/med/ophitoxaemia.htm
  3. https://web.archive.org/web/20070312151019/http://www.engin.umich.edu/~cre/web_mod/viper/introduction.htm
  4. https://web.archive.org/web/20070828041729/http://www.stlzoo.org/animals/abouttheanimals/reptiles/snakes/kingcobra.htm
  5. http://www.sandiegozoo.org/animalbytes/t-cobra.html
  6. https://web.archive.org/web/20070810021640/http://encarta.msn.com/media_631509401_761559191_-1_1/King_Cobra.html
  7. [Dr. Zoltan Takacs: Why the cobra is resistant to its own venom?]
  8. https://web.archive.org/web/20081207071838/http://www.uoregon.edu/~astanton/snakes/africansnakes.htm
  9. https://web.archive.org/web/20070517014928/http://www3.nationalgeographic.com/animals/reptiles/king-cobra.html
  10. [Munich AntiVenom Index: Ophiophagus hannah]

బయట లింకులు

మార్చు