నల్ల బెండ లేదా అడవి బెండ గా పిలువబడే ఎబెల్మొషస్ ఫికల్నియస్ ఒక పుష్పించే మొక్క. ఇది ఎబెల్మొషస్ జీనస్కు చెందినది. మాల్వేసే కుటుంబానికి చెందినది. ఇది తంతుయుత మొక్క, అనగా ఈ మొక్కలో పీచు పదార్థం ఉంటుంది. ఈ మొక్క కాస్త గట్టి కాండంతో న్నిత్యహరితంగా ఉంటుంది. ఈ మొక్క పుష్పాలు ఒక అంగుళం వ్యాసం కలిగి, తెలుపు లేదా లేత గులాబీ రంగులో మధ్యలో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఈ మొక్క ఆకులు హస్తాకారంలో ఉంటాయి.[1]

నల్ల బెండ
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. ficulneus
Binomial name
Abelmoschus ficulneus
(L.) Wight & Arn.
Synonyms

పరుపుబెండ, అడివిబెండ

ఎబెల్మొషస్ ఫికల్నియస్
ఎబెల్మొషస్ ఫికల్నియస్
Scientific classification
Kingdom:
వృక్ష సామ్రాజ్యం
(unranked):
యాంజియోస్పర్మ్
(unranked):
యూడికాట్స్
(unranked):
రాసిడ్స్
Order:
మాల్వెల్స్
Family:
మాల్వేసే
Genus:
ఎబెల్మోషస్

(L.) Wight & Arn.

ఈ మొక్క ఒక చిన్న నిటారయిన పొదగా పెరుగుతుంది. 2 నుండి 5 అ. (1 నుండి 2 మీ.) పొడవు, 2 నుండి 6 అ. (1 నుండి 2 మీ.) వెడల్పు. ఆకులు 5 నుండి 8 cమీ. (2 నుండి 3 అం.) పొడవు, 4 నుండి 7 cమీ. (2 నుండి 3 అం.) వెడల్పు ఉండి గుండ్రటి ఆకారంలో ఉంటాయి, (కొసల వద్ద హృదయాకారంలో). ఆకులు రెండు వైపులా గరుకుగా సన్నని ముళ్ళతో, ఒక్కో ఆకు 3 నుండి 5 విభాగాలుగా ఉంటుంది. పువ్వులు మృదువయిన చిన్న చిన్న నారలతో కప్పబడి ఉంటాయి. ఆకు పరిమాణం, అడ్డకొలత 5 నుండి 7 cమీ. (2 నుండి 3 అం.) ఉంటుంది. పువ్వుల పరిమాణం చిన్నదై, తెలుపు నుండి లేత గులాబీ రంగులో ఉంటూ, పువ్వు మధ్య భాగం ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పువ్వులు కొద్ది రోజులు బ్రతుకుతాయి. చెట్టుకు ఉండే చిన్న చిన్న నారలు దురద కలిగిస్తాయి.[2] ఈ మొక్క యొక్క బీజాలు నారలతో, బంకగా ఉంటాయి. ఇవి అండాకారంలో 2.5–4 cమీ. (1–2 అం.) పొడవు, 1.3–2 cమీ. (1–1 అం.) వెడల్పుతో ఐదైదు బీజవరుసలు, ఒక చిన్ని కొనతో ఉంటాయి. పరిపక్వత చెందని బీజాలు మధ్యస్తం నుండి ముదురు పచ్చ రంగులో ఉంటాయి. అవి పరిపక్వత పొందాక ముదురు గోధుమ రంగుకు మారతాయి. ఆ సమయంలో ఇవి అయిదు బీజవరుసలుగా విడిపోతాయి, 10 నుండి 20 నల్లని గుండ్రటి గింజలు బయట పడతాయి. ఎబెల్మొస్షస్ ఫికల్నియస్ వసంత, గ్రీష్మ ఋతువుల్లో, వర్షపాతం, సేద్యం ప్రభావాల తరువాత, మొలకెత్తుతాయి. ఈ మొక్క శిశిర ఋతువు వచ్చే వరకూ వేగంగా పెరుగుతుంది. పువ్వులు పూసిన నెలకే వ్విత్తనాలు వృద్ధి చెందుతాయి. ఈ పువ్వులు గ్రీష్మ ఋతువు ఆఖరులో, శిశిర ఋతువులో పూస్తాయి.

ఈ మొక్క భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, మడగాస్కర్, ఉత్తర ఆస్ట్రేలియాకు చెందినది. కాలక్రమేణా ఉత్తర ఆస్ట్రేలియాలో ఇది ఒక కలుపు మొక్కగా మారింది, ముఖ్యంగా పత్తి పంటలో.[3]

చిత్రావళి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Taxon: Abelmoschus ficulneus (L.) Wight & Arn". USDA Germplasm Resources Information Network. Archived from the original on 7 అక్టోబరు 2012. Retrieved 29 July 2010.
  2. "White Wild Musk Mallow". Flowers of India. Retrieved 29 July 2010.
  3. "Native rosella". Cotton Catchment Communities. Archived from the original on 25 జూలై 2008. Retrieved 29 July 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=నల్ల_బెండ&oldid=3798260" నుండి వెలికితీశారు