నవమన్మధుడు 2016లో విడుదలైన తెలుగు సినిమా. డి.ప్ర‌తాప్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బృందావన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్ నిర్మించిన ఈ సినిమాకు వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించాడు.[1] ధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘తంగ మగన్’ పేరుతో, తెలుగులో ‘నవమన్మధుడు’ పేరుతో 18 డిసెంబర్ 2015న విడుదలైంది.[2]

నవమన్మధుడు
దర్శకత్వంవేల్‌రాజ్‌
రచనవేల్‌రాజ్‌
నిర్మాతఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్
తారాగణంధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌
ఛాయాగ్రహణంఎ. కుమారన్
కూర్పురాజేష్ కుమార్
సంగీతంఅనిరుద్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
బృందావన్ పిక్చర్స్
విడుదల తేదీ
18 డిసెంబర్ 2015
సినిమా నిడివి
121 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

భరత్(ధనుష్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు, తన ఫ్రెండ్స్ తో కలిసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. హేమ (అమీజాక్సన్)తో ప్రేమలో పడతాడు. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోతారు. దీంతో హేమను అరవింద్(అదిత్ అరుణ్) పెళ్లి చేసుకుంటాడు. ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ లో భరత్ ఉద్యోగంలో చేరి యమున(సమంత) ను పెళ్లి చేసుకుంటాడు. హేమ భర్త అరవింద్ వలన ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ లో పనిచేసే భరత్ తండ్రి (కె.యస్.రవికుమార్) ఒక కేసులో ఇరుక్కొని, ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు ఆ కేస్ ఏంటి? భరత్ తండ్రికి, అరవింద్ కు వున్న సంబంధం ఏంటి? భరత్ తండ్రి ఆ కేసులో ఎలా ఇరుక్కుంటాడు? భరత్, హేమలు ఎందుకు విడిపోయారు? తన తండ్రి ఇరుక్కున్న కేసులో వున్న వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: బృందావన్ పిక్చర్స్
  • నిర్మాత: ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేల్‌రాజ్‌
  • సంగీతం: అనిరుధ్
  • సినిమాటోగ్రఫీ: ఎ.కుమర‌న్
  • ఎడిటర్: ఎం.వి.రాజేష్‌కుమార్
  • స‌హ నిర్మాత‌లు: ఎం.డి.ఎం.ఆంజ‌నేయ‌రెడ్డి, కె.య‌స్‌.రెడ్డి

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "మనసా మనసా"  ధనుష్ & సునీత సారథి 4:36
2. "ఏమన్నావూ"  శ్వేతా మోహన్ 3:36
3. "నీ టక్కరి లుక్ కె"  అనిరుద్ రవిచందర్ 2:34
4. "ఒడిని లాలీ"  ధనుష్ & శ్వేతా మోహన్ 2:58
13:44

మూలాలు

మార్చు
  1. Sakshi (11 December 2015). "నవ మన్మథుడిగా..." Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Times of India (2015). "Nava Manmadhudu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. The New Indian Express (2015). "Dhanush Returns As Nava Manmadhudu". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  4. The Times of India (2015). "KS Ravikumar to play Dhanush's dad? - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.