సమంత
సమంత (జ. 28 ఏప్రిల్, 1987) తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
సమంత | |
![]() | |
జన్మ నామం | సమంత రుతు ప్రభు |
జననం | భారతదేశం | 1987 ఏప్రిల్ 28
ఇతర పేర్లు | యశోద |
క్రియాశీలక సంవత్సరాలు | 2007 - ఇప్పటివరకు |
మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.
నటించిన చిత్రాలుసవరించు
తెలుగుసవరించు
సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
2010 | ఏ మాయ చేశావే | జెస్సీ | 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి, 'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటి, 'విజేత', నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్, 'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2011 - ఉత్తమ నటి, పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి |
2010 | బృందావనం | ఇందు | |
2011 | దూకుడు | ప్రశాంతి | పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి, పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి |
2012 | ఈగ | బిందు | తమిళంలో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది, 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి, 'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2012 - ఉత్తమ నటి, 'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నటి |
2012 | ఎటో వెళ్ళిపోయింది మనసు | నిత్య | |
2013 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | గీత | |
2013 | జబర్‌దస్త్ | శ్రేయ | |
2013 | సమ్‌థింగ్ సమ్‌థింగ్ | అతిథి పాత్ర | |
2013 | అత్తారింటికి దారేది | శశి | |
2013 | రామయ్యా వస్తావయ్యా | ఆకర్ష | |
2014 | ఆటోనగర్ సూర్య | శిరీష | |
2014 | మనం | ప్రియ/కృష్ణవేణి | |
2014 | రభస | ||
2018 | మహానటి | మధురవాణి | మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంంగా తెరకెక్కిన సినిమలో ప్రజవాణి పత్రిక విలేఖరి. |
2018 | యూ టర్న్ | రచన | |
2019 | ఓ బేబి |
తమిళంసవరించు
సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
2010 | విన్నైతాండి వరువాయా | నందిని | అతిథి పాత్ర |
2010 | బాణ కాథడి | ప్రియ | పేర్కొనబడింది, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి |
2011 | మాస్కోవిన్ కావేరి | కావేరి | |
2012 | నడునిశి నాయగల్ | అతిథి పాత్ర | |
2012 | నాన్ ఈ | బిందు | తెలుగులో "ఈగ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది |
2013 | నీదానే ఎన్ పొన్వసంతం | నిత్య | ఎటో వెళ్ళిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం, ఇందులో నానీ పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి, 'విజేత', వికటన్ అవార్డ్ - ఉత్తమ నటి, 'విజేత', విజయ్ అవార్డ్ - ఉత్తమ నటి |
2014 | అంజాన్ | జీవా | చిత్రీకరణ జరుగుతున్నది |
2014 | కత్తి | వేణి | చిత్రీకరణ జరుగుతున్నది |
పురస్కారాలుసవరించు
- స్పెషల్ జ్యూరీ అవార్డు - ఏ మాయ చేశావే
బయటి లింకులుసవరించు
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమంత పేజీ