నవాదా
నవాదా బీహార్ రాష్ట్రం, నవాదా జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. అదే పేరుతో ఉన్న డివిజనుకు ముఖ్యపట్టణం కూడా. ఇది 24º 53 'ఉత్తర అక్షాంశం, 85º 33' తూర్పు రేఖాంశం వద్ద ఖురి నదికి ఇరు వైపులా విస్తరించి ఉంది. ఈ పేరు నౌ-వాడా నుండి ఉద్భవించింది. దీనికి అర్థం కొత్త పట్టణం.[2] 1973 జనవరి 26 న నవాదా ముఖ్యపట్టణంగా నవాదా జిల్లా ఏర్పడింది.
నవాదా | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°53′N 85°32′E / 24.88°N 85.53°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మగధ |
జిల్లా | నవాదా |
Elevation | 80 మీ (260 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,09,141 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 805110,805111 |
టెలిఫోన్ కోడ్ | 06324 |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-27 |
లింగనిష్పత్తి | 1.14 ♂/♀ |
భౌగోళికం
మార్చునవాదా 24°53′N 85°32′E / 24.88°N 85.53°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 80 మీటర్ల ఎత్తున ఉంది. ఖురి నది పట్టణం గుండా పోతుంది, నదికి ఎడమ ఒడ్డున పాత విభాగం, కుడి ఒడ్డున ప్రభుత్వ కార్యాలయాలు, ఉప జైలు, డిస్పెన్సరీ, పాఠశాలలతో కూడిన కొత్త పట్టణం ఉంటుంది.
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, నవాదా జనాభా 109,141. లింగనిష్పత్తి 1,000 మంది పురుషులకు 957 మంది మహిళలు. సగటు అక్షరాస్యత 74%. ఇది జాతీయ సగటు 63.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 81%, స్త్రీల అక్షరాస్యత 67%. నవాదా జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[4] హిందీ, మగధి, ఉర్దూలు ఈ ప్రాంతంలో మాట్లాడే ప్రధాన భాషలు.
రైలుమార్గం
మార్చు- పాట్నా రైల్వే స్టేషన్ ay గయా రైల్వే స్టేషన్ → నవాదా రైల్వే స్టేషన్
రోడ్లు
మార్చు- పాట్నా నుండి ఎన్‌హెచ్ 31 ద్వారా నవాదాకు రహదారి సౌకర్యం ఉంది.
మూలాలు
మార్చు- ↑ "View Population". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-08. Retrieved 2021-01-20.
- ↑ Falling Rain Genomics, Inc - Nawada
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-10-07. Retrieved 2021-01-20.