నవాదా జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో నవాదా జిల్లా (హిందీ:) ఒకటి. నవాదా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు మగధ్, సుంగ, గుప్తుల పాలనలో ఉండేది. ఈ జిల్లా చారిత్రాత్మకమైన గయ, నలందా జిల్లాల మద్య ఉంది.

నవాదా జిల్లా

नवादा जिला ضلع نوادا
బీహార్ పటంలో నవాదా జిల్లా స్థానం
బీహార్ పటంలో నవాదా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుమగధ
ముఖ్య పట్టణంనవాదా
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలునవాదా
విస్తీర్ణం
 • మొత్తం2,492 కి.మీ2 (962 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం20,59,179
 • సాంద్రత830/కి.మీ2 (2,100/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత61.63 %
 • లింగ నిష్పత్తి936
ప్రధాన రహదార్లుNH 31
జాలస్థలిఅధికారిక జాలస్థలి

భౌగోళికంసవరించు

నవాదా జిల్లా వైశాల్యం 2494 చ.కి.మీ.[1] ఇది చిలే దేశంలోని నవారినో ద్విపానికి సమానం.[2] జిల్లా కేంద్రగా నవాదా పట్టణం ఉంది. జిల్లాలో అధికభూభాగం చదునైన మైదానంగా ఉంటుంది. కొంతభూభాగం మాత్రమే కొండప్రాతం ఉంది.

నదులుసవరించు

జిల్లాలో సక్రి, కురి, పంచానె, భుస్రి, కకొలత్, తిలైయా, ధనర్జయ్ నదులు ప్రవహిస్తున్నాయి.

ఆర్ధికంసవరించు

వ్యవసాయంసవరించు

జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమ, పప్పుధాన్యాలు, కూరగాయలు పండుతున్నాయి.

పరిశ్రమలుసవరించు

బిది ఫ్యాక్టరీలు, చక్కెర మిల్లులు, చేనేత పరిశ్రమలు ఉన్నాయి.

జిల్లాలో అధికంగా చెరకు పండించబడుతుంది. వరిసలిగంజ్ చెరకు మిల్లు ప్రస్తుతం మూతపడుంది. నవాదాకు 6 కి.మీ దూరంలో కదిర్గంజ్ వద్ద పురాతనమైన స్మాల్ స్కేల్ పట్టుపరిశ్రమ ఉంది. ఇక్కడ పలువురు నేతవారు పట్టును శుభ్రం చేయడం, నేయడం వంటివి చేస్తుంటారు. ఇది భాగల్‌పూర్తో వ్యాపార, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. పట్టు పరిశ్రమకు భాగల్‌పూర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండి పట్టు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయబడుతూ ఉంటుంది. " న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి జిల్లాలోని రాజౌల్ అనుకూలమైనదనిగుర్తించింది. " ది సెంట్రల్ ఎలెక్ట్రిసిటీ అథారిటీ కమిటీ " ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపింది.

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నవాదా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

మార్కెట్సవరించు

సౌత్ బీహార్ రైల్వే ప్రారంభించిన నవాదా వద్ద స్టేషను ఆరంభించిన తరువాత ఇది ప్రముఖ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. మొదట నుండి పరిసరాలలోని పలు గ్రామాలకు నవాదా వ్యాపారకేంద్రంగా ఉండేది. నగరంలోని పూరణి బజార్, మెయిన్‌రోడ్డు, గోలా రోడ్డు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. జిల్లాలో యాదవులు, బరంవాల్, జైనులు, సాహూలు అధికంగా ఉన్నారు.

విభాగాలుసవరించు

  • ఉపవిభాగాలు :- నవాదా, రాజౌల్.
  • మండాలాలు :- కవకొల్, వరిసలిగంజ్, నవదహ్, రజౌలి, అక్బర్పుర్, హిసూ, నర్హత్, గోవిందపూర్, పక్రిబరవన్, సిర్దల్ల, కసిచక్, రోల వైఖరితో, నర్దిగంజ్, మెస్కౌర్

ప్రయాణ వసతులుసవరించు

జాతీయరహదారి 31 నుండి రాంచి, జషద్‌పూర్, బొకారో, ధంబాద్, బీహార్ సఫారీ, పాట్నా లతో జిల్లా అనుసంధానించబడింది. నవాదా నుండి ప్రధాన నగరాలకు డీలక్స్ బసులు లభ్యం ఔతున్నాయి. నవాదా గయ- కియుల్ రైలు మార్గం ద్వారా రెండు ప్రధాన నగరాలతో అనుసంధానమై ఉంది. ఈ మార్గం గుండా 2,ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, పలు లోకల్ రైళ్ళు పయనిస్తున్నాయి. జిల్లాలో ఉన్న రాజౌల్, సిరిడల్లా వంటి ప్రధాన వ్యాపార కేంద్రాల అభివృద్ధికి ఈ రైలు మార్గం సహకరిస్తుంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,216,653,[4]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 205 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 889 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.49%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. [ http://en.wikipedia.org/w/index.php?title=Nawada&action=edit&section=2] 936:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 61.63%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

సంస్కృతిసవరించు

పర్యాటక ఆకర్షణలుసవరించు

  • కకోలత్ జలపాతం :- నవాదా జిల్లాలోని అందమైన జలపాతంగా ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం హిందూ పురాణాలలో ప్రస్తావించబడింది. అగస్త్యమహర్షి శాపం పొందిన నహుషుడు కొండచిలువగా మారి ఇక్కడ నివసించాడని విశ్వసిస్తున్నారు. భరతదేశంలో గొప్ప జలపాతాలలో ఇది ఒకటని భావిస్తున్నారు. సంవత్సరం అంతా ఈ జలపాత జలం శీతకంగా ఉంటుంది.

పర్యాటకుల సందర్శనానికి వేసవి కాలం అనుకూలమైనది. నవాదా - అక్బర్‌పూర్ - గోవుందపూర్ రహదారి ద్వారా ఇక్కడకు చేరికోవచ్చు.

మూలాలుసవరించు

  1. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.CS1 maint: extra text: authors list (link)
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Navarino Island 2,473km2 horizontal tab character in |quote= at position 16 (help)
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు