నవేగావున్ జాతీయ ఉద్యానవనం
నవేగావున్ జాతీయ ఉద్యానవనం మహారాష్ట్ర రాష్ట్రంలోని గొండియా జిల్లాలోని అర్జుని మోర్గాన్ అనే నగరానికి చేరువలో ఉంది..[1]
నవేగావున్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | గొండియా జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం |
Nearest city | అర్జుని మోర్గాన్ |
Area | 133.88 కి.మీ2 (51.69 చ. మై.) |
చరిత్ర
మార్చుఈ ఉద్యనవనాన్నికి నవేగావున్ పేరు వెనుక నవే అనగా మరాఠీ భాషలో కొత్త అని, గావ్ అనగా గ్రామం అని అర్థం. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన ప్రాంత ప్రజలు నివాసిస్తుండేవారు.
మరిన్ని విశేషాలు
మార్చుఇది మహారాష్ట్ర రాష్ట్రం యొక్క తూర్పు భాగంలో ఉంది. ఈ ఉద్యానవనం 133.78 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనాన్ని సాధారణంగా పక్షుల అభయారణ్యంగా పిలుస్తారు. అదేకాక ఇందులో 209 జాతుల పక్షులు, 9 రకాల సరీసృపాలు, 26 రకాల క్షీరదాలు పులులు, చిరుతపులులు అడవి పిల్లులు, తోడేళ్ళు, అడవి పందులు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. ఈ ఉద్యనవనాన్ని ఏటా దాదాపు 50,000 మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఈ ఉద్యానవనం చుట్టూ నాగ్జిరా వన్యప్రాణుల అభయారణ్యం (60 కి.మీ), ఇటియాడో ఆనకట్ట (20 కి.మీ), గోథంగావ్ వద్ద టిబెటన్ క్యాంప్ (15 కి.మీ), ప్రతాప్‌గడ్ (15 కి.మీ). వంటి చూడదగిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Navegaon National Park, Maharashtra Tourism, archived from the original on 2013-01-14, retrieved 2013-01-02