నవ్య
వార పత్రిక
నవ్య ఆంధ్రజ్యోతి ప్రచురణ విభాగపు వార పత్రిక. 2008 సంవత్సరంలో దీని యొక్క 4 వ సంపుటి నడుస్తున్నది. దీని మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ.
ప్రతీ పత్రికలో కథలు, ధారావాహికలు కాకుండా కొన్ని శీర్షికలు ప్రచురిస్తున్నారు.
శీర్షికలు
మార్చు- మహాభారతం
- పడమటి కొండలు: డా.ఎస్.శంకరయ్య - సి.పి.బ్రౌన్ అకాడమీ నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల.
- రాగవిపంచి: ఎస్.ఘటికాచలరావు - సి.పి.బ్రౌన్ అకాడమీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల.
- ఫ్యామిలీ ఫోటో: పి.చంద్రశేఖర్ ఆజాద్ - సి.పి.బ్రౌన్ అకాడమీ నవలల పోటీలో తృతీయ బహుమతి పొందిన నవల.
- పొగబండి కథలు: ఓలేటి శ్రీనివసభాను.
- పాల బువ్వ పిల్లల శీర్షిక - చిట్టిబాబు నిర్వహిస్తున్నాడు.
- తెలుగు పద్యం వెలుగు జిలుగులు - పంతుల జోగారావు నిర్వహిస్తున్నాడు.