నవ్వులాట సూర్య వంశీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద డిపి వర్మ నిర్మించిన 1998 నాటి కామెడీ సినిమా. గోపీచంద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎం.ఎం శ్రీలేఖ సంగీతం అందించింది. రాజేంద్ర ప్రసాద్, మహేశ్వరి నటించారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది.[1]

నవ్వులాట
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం గోపీచంద్
తారాగణం రాజేంద్ర ప్రసాద్
నిర్మాణ సంస్థ సూర్యవంశీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

బోస్ (రాజేంద్ర ప్రసాద్) ఒక మోసగాడు. అతని స్నేహితుడు నాని (సుధాకర్) తో పాటు ప్రేమ శిక్షణా సంస్థను నడుపుతూంటాడు. ఒకసారి వారు ఒక కళాశాల విద్యార్థి చందు (తిరుపతి ప్రకాష్) కు, ఒక అందమైన అమ్మాయి చందన (మహేశ్వరి) ను ప్రేమించేందుకు మార్గనిర్దేశం చేస్తారు. బోసుపై పోలీసు కేసు దాఖలు చేసినప్పుడు వాళ్ళు అతన్ని చితగ్గొడతారు. వెంటనే, బోస్ తన సంస్థను మూసివేసి, పెళ్ళిళ్ళ బ్యూరోను ప్రారంభిస్తాడు. కొద్దిసేపటికే, చందన మామ నల్లరాయుడు (బాబు మోహన్), ఏజ్ బార్ బ్యాచిలర్, వధువు కోసం అతనిని సంప్రదిస్తాడు. అదే సమయంలో, బోసుకు అప్పిచ్చిన సేఠ్ (సుబ్బరాయ శర్మ) అతన్ని పీడిస్తూంటాడు. కాబట్టి, అతను నల్లరాయుడును హీరోయిన్ నగ్మాతో పెళ్ళి చేయిస్తానని మోసం చేస్తాడు. అది తెలుసుకున్న చందన అతనికి ఒక పాఠం నేర్పించాలనుకుంటుంది. ఆమె తన అసలు గుర్తింపును ఇవ్వకుండా అతన్ని పక్కదారి పట్టిస్తుంది. అనేక అడ్డంకులను దాటిన తరువాత, బోస్ ఆమె ప్రతీకారం కోసం ఆ పనిచేసిందని తెలుసుకుంటాడు. అయితే, బోస్ ఆమె ప్రేమను పొందాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం అతను చందన తండ్రి గోపాలం (గిరి బాబు) వద్ద ఉద్యోగిగా చేరతాడు. తనను తాను బోస్ కవల సోదరుడు వాసుగా పరిచయం చేసుకుంటాడు. ఆ తరువాత, అతను ఒక నర్సు మేరీ (కోవై సరళ) ని తన తల్లిగా ప్రవేశపెడతాడు. ఎవరో తెలియని వ్యక్తి ఫోటోను తెచ్చి చనిపోయిన తండ్రి అని చెబుతాడు. అప్పుడు శ్రీశైలం (తనికెళ్ళ భరణి) అనే ఆ ఫోటో లోని వ్యక్తి అతడి జీవితంలోకి ప్రవేశిస్తాడు. బోస్ ఈ సమస్యను దాటి, చందన హృదయాన్ని ఎలా గెలుచుకుంటాడనేది మిగతా కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."చిక్ చిక్ లడకీ"మనో, శ్రీలేఖ4:19
2."పెళ్ళీడొచ్చిందో"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:27
3."ఐ లవ్ యూ బేబీ"శ్రీనిధి, అనురాధ3:17
4."ప్రేమించి చూడు"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శ్వేత నాగు4:59
5."ఈవేళ అన్నివిధాల"మనో, శ్రీలేఖ4:48
మొత్తం నిడివి:21:50

మూలాలు

మార్చు
  1. "Navvulata (Review)". gomolo.com. Archived from the original on 2018-07-12. Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=నవ్వులాట&oldid=3702245" నుండి వెలికితీశారు