నాగవంశం : వెనుకబడిన తరగతుల జాబితాలో `డి' గ్రూప్‌ కులం.

ఆచారాలుసవరించు

ముక్కుకు కమ్ములు, అడ్డుగమ్మి, చెవులకు కొనకమ్ములు, నాగుజోడు, కాళ్ళకు అందెల కడియాలు ధరించటం ఈ స్త్రీల ఆచారం.

చరిత్రసవరించు

నాగవంశంవారు నాగాలాండ్‌, చోటా నాగపూర్‌, మణిపూర్‌, కల్హండి, మహా రాష్ర్ట ప్రాంతాల నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రాలో వ్యవసాయ కార్మికులుగా స్థిరపడ్డారు. భారతదేశంలో అతి ప్రాచీన క్షత్రియ సామ్రాజ్యాల్లో నాగవంశం ఒకటి. కేరళలో అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నిధిని దాచి పెట్టిన ట్రావన్కోర్ సామ్రాజ్యానికి చెందిన మార్తాండ వర్మ నాగవంశానికి చెందిన వాడు. వర్ణ వ్యవస్థ ప్రకారం వీరు క్షత్రియులైనా వెనుకబడ్డ కులాల్లో చేర్చబడ్డారు.

సమకాలీన జీవన విధానం వృత్తిసవరించు

ఉత్తర కోస్తా జిల్లాల్లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు, నీటి వనరులకు చాలా దూరంగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం ల్లో ఎక్కువగా నివశిస్తుంటారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తారు. బతుకుదెరువు కోసం పలసలుపట్టి పట్టణాలకు చేరినా నగరవాసుల్లో ఇమడలేకపోతున్నారు. కనుకనే వీరంతా ఎక్కడున్నా ఒకటిగా జీవిస్తుంటారు. విజయవాడ నగరానికి వలస వచ్చిన నాగవంశం వారు నివాసానికి ఎంచుకున్న ప్రాంతం ఇంద్రకీలాద్రి పర్వతం! వీరి పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. కుటుంబాన్ని పొషించే ఆర్థిక స్తోమత లేకనే వీరు ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నారు. వీరు అధికశాతం వ్యవసాయ కార్మికులే.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

వెబ్ సైట్సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నాగవంశం&oldid=3586441" నుండి వెలికితీశారు