నాగ్నజితి

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఐదవ భార్య. కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమ

నాగ్నజితి భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో[1] ఐదవ భార్య. కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. [2]ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను.[3] శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

నాగ్నజితి
మహాభారతం పాత్ర
శ్రీకృష్ణుడి అష్టభార్యలు (19వ శతాబ్దపు మైసూర్ చిత్రపటం)
సమాచారం
దాంపత్యభాగస్వామిశ్రీకృష్ణుడు

కుటుంబం మార్చు

విష్ణు పురాణం, భాగవత పురాణం, హరివంశం ప్రకారం ఈమెను సత్య నాగ్నజితి అని పిలుస్తారు. ఈమె తండ్రి నాగ్నజిత్తు కోసల రాజ్యానికి రాజు, దీని రాజధాని అయోధ్య. భాగవత పురాణం నాగ్నజితిని కౌసల్య అని పిలుస్తుంది, "కోసలకు చెందినది", కోసల యువరాణి.[4][5] సత్య అని కృష్ణుడి భార్య మహాభారతంలో ప్రస్తావించబడింది.[6]

వివాహం మార్చు

భాగవత పురాణం నాగ్నజితి వివాహం కథను వివరిస్తుంది. నాగ్నజిత్తు ధర్మబద్ధమైన రాజు, వేద గ్రంథాలను ఎంతో భక్తితో అనుసరించాడు. తన ఏడు భయంకరమైన ఎద్దులను యుద్ధంలో ఓడించి తన కుమార్తెను వివాహం చేసుకోవాలని రాజు షరతు పెట్టాడు. ఆ షరతు గురించి తెలుసుకున్న కృష్ణుడు కోసల రాజ్యానికి బయలుదేరాడు. కృష్ణుడు తరాగానే నాగ్నాజిత్తు తన సింహాసనం నుండి లేచి కృష్ణుడికి బహుమతులు ఇచ్చి, కోసలకి హృదయపూర్వకంగా స్వాగతం పలికాడు. నాగ్నజితి కూడా కృష్ణుడిని చూసి చాలా సంతోషించి, కృష్ణుడు తన భర్త కావాలని ప్రార్థించింది. రాజు, అతని కుమార్తె ఇద్దరికీ కృష్ణుడి దైవత్వం గురించి తెలుసు. నాగ్నజిత్తు కృష్ణుడిని పూజించి, అతని సందర్శన ఉద్దేశ్యాన్ని అడుగుతాడు. తాను నాగ్నజితిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని కృష్ణుడు చెప్పినప్పుడు, ఏడు ఎద్దులను అదుపులోకి తెచ్చినవాడికే తన కుమార్తెకు ఇస్తానని అంటాడు. రాజు కృష్ణుని శౌర్యాన్ని ప్రశంసించి, ఏడు ఎద్దులను సులభంగా మచ్చిక చేసుకోగలడని చెప్పాడు.[7][8]

రాజు మాట విన్న తరువాత, కృష్ణుడు ఏడు రూపాలుగా మారి, ఏడు ఎద్దుల చుట్టూ నిలబడి ఒక శబ్దం చేశాడు. నాగ్నజిత్తు రాజు, అతని కుమార్తె సంతోషించారు. శ్రీకృష్ణుడు, నాగ్నజితి వివాహం వైభవంగా జరిగింది. రాజు కృష్ణుడికి 10,000 ఆవులు, 9,000 ఏనుగులు, 9,00,000 రథాలు, 90,000,000, 9,000,000,000 మగ సేవకులను కట్నంగా అందించాడు. కృష్ణుడు, నాగ్నాజితి వారి రక్షణ కోసం వచ్చిన సైన్యంతో కలిసి ద్వారకా నగరం వైపు బయలుదేరారు. నాగ్నాజిత్తు ఎద్దుల పోటీలో ఓడిపోయిన యువరాజులు మార్గమధ్యంలో వీరిపై దాడి చేశారు. కృష్ణుడి సైన్యం, అతని యాదవ వంశ యోధులు, అతని స్నేహితుడు అర్జునుడు ఆ యువరాజులను ఓడించి వారిని తరిమికొట్టారు. తరువాత, కృష్ణుడు తన భార్య నాగ్నజితితో కలిసి ద్వారకలోకి ప్రవేశించి సంతోషంగా జీవించాడు.[7][8]

తరువాతి జీవితం మార్చు

నాగ్నజితి, శ్రీకృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అని 10మంది పిల్లలు కలిగారు. భద్రవిందతో ఆమెకు చాలామంది కుమారులు ఉన్నారని విష్ణు పురాణం చెబుతోంది. కృష్ణుని అంత్యక్రియలలో రాణుల ఏడుపులును భాగవత పురాణం వివరిస్తోంది.[9]

మూలాలు మార్చు

  1. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. p. 62. ISBN 978-0-8426-0822-0.
  2. శ్రీమద్ భాగవతం 10.58.32 Archived 2014-06-14 at the Wayback Machine
  3. శ్రీమద్ భాగవతం 10.58.33 Archived 2014-06-16 at the Wayback Machine
  4. Horace Hayman Wilson (1870). The Vishńu Puráńa: a system of Hindu mythology and tradition. Trübner. pp. 79–82, 107. Retrieved 22 February 2013.
  5. Prabhupada. "Bhagavata Purana 10.58". Bhaktivedanta Book Trust. Archived from the original on 26 ఆగస్టు 2013. Retrieved 16 జూలై 2020.
  6. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. p. 704. ISBN 978-0-8426-0822-0.
  7. 7.0 7.1 "Five Ques married by Krishna". Krishnabook.com. Retrieved 16 July 2020.
  8. 8.0 8.1 Prabhupada. "Bhagavata Purana 10.58.32". Bhaktivedanta Book Trust. Archived from the original on 14 జూన్ 2014. Retrieved 16 జూలై 2020.
  9. Prabhupada. "Bhagavata Purana 11.31.20". Bhaktivedanta Book Trust. Archived from the original on 13 జూన్ 2010. Retrieved 16 జూలై 2020.