నాగ వైష్ణవి
పలగాని నాగ వైష్ణవి (21 జనవరి 2000 - 2 ఫిబ్రవరి 2010) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త పలగాని ప్రభాకరరావు అతని రెండవ భార్య నర్మద కుమార్తె.
నాగ వైష్ణవి | |
---|---|
జననం | 2000 జనవరి 21 , భారతదేశం |
మరణం | 2010 ఫిబ్రవరి 2 ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
తండ్రి | ప్రభాకర్ రావు |
తల్లి | నర్మదా వైష్ణవి |
అదృశ్యం హత్య
మార్చునాగ వైష్ణవి 30 జనవరి 2010న కిడ్నాప్ చేయబడింది, [1] ఫిబ్రవరి 2న వైష్ణవి ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఆ సంఘటన విన్న వైష్ణవి తండ్రి ప్రభాకర్ రావు గుండె ఆగి మరణించాడు [2] [3] వైష్ణవి గతంలో 2005లో కిడ్నాప్‌కు గురైంది. వైష్ణవి హత్య ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. [4]
వైష్ణవి కిడ్నాప్‌కు గురైనప్పుడు ఆమె అన్న సాయి తేజేష్ కిడ్నాపర నుంచి తప్పించుకున్నాడు. వైష్ణవి తండ్రి తన కుమార్తె హత్యకు న్యాయం చేయాలని కోరాడు, [5] గుండెపోటుతో మరణించాడు.
విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు 2018 జూన్‌లో ముగ్గురు కిడ్నాపర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. [6]
నిందితులకు శిక్ష ఖరారు కాకముందే నాగ వైష్ణవి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. [6]
మూలాలు
మార్చు- ↑ Krishna Rao: "Double tragedy: Vaishnavi’s father dies of shock" Archived 2016-05-12 at the Wayback Machine, The New Indian Express, 3 February 2010, retrieved 3 April 2011
- ↑ "Vaishnavi’s father dies in hospital", The Hindu, 3 February 2010, retrieved 3 April 2011
- ↑ "Andhra tycoon dies of heart attack after daughter killed by kidnappers", The Times of India, 3 February 2010, retrieved 3 April 2011
- ↑ Susarla, Ramesh (2 February 2010). "Vaishnavi was murdered on way to Guntur?". The Hindu. Retrieved 29 August 2018 – via www.thehindu.com.
- ↑ Samdani, M N (3 January 2013). "3 years after murder, justice eludes Vaishnavi". The Times of India. Retrieved 13 January 2019.
- ↑ 6.0 6.1 "Decade after 10-yr-old Naga Vaishnavi's murder, AP court gives life term to 3". thenewsminute.com. 14 June 2018. Retrieved 29 August 2018.