నానకు చరిత్ర

తెలుగు రచన

నానకు చరిత్ర చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గురు నానక్ జీవితచరిత్ర గ్రంథం. దీనిని మట్టే సుబ్బారావు, రాజమండ్రి 1920 సంవత్సరంలో ప్రచురించారు.

పీఠికసవరించు

"హిందూస్థానమున వాయువ్యదిగ్భాగమందు పూర్వము నుండియు సుప్రసిద్ధమగు పాంచాల మను దేశము గలదు. అది ప్రస్తుతము పంజాబుదేశమను పేర వ్యవహరింప బడచున్నది. ఆదేశమునందు లాహోరు ముఖ్యపట్టణము. ఆ నగరమునకు సమీపమున "టాల్వెండి" యను పల్లె యొకటికలదు. నానకు "టాల్వెండి" గ్రామమందు సా.శ. 1468 వ సంవత్సరమున జన్మించెను. నానకు సీకుమతమును స్థాపించిన మహాత్ముడు. జనులు సనాతనము లగు నుత్తమధర్మముల విడచి దురాచారములే సదాచారముగ భావించి భ్రష్టులగుచుండ జూచి జాలినొంది కేవల లోకోపకార పరాయణుడై నానకు పరమార్థ మెఱుగక గతాను గతిగముగ నథోగతిపాలగుచుండిన తోడిజనుల నుద్ధరించుటకు మంచిదారింజూపిన మహానుభావు డగుటచే నాతనిచరిత్రము నెల్లవారు జదువదగినదని వ్రాయబూనితిని." అని పుస్తకంలో గ్రంథకర్త పేర్కొన్నాడు.

విషయసూచికసవరించు

  1. ప్రథమాధ్యాయము
  2. ద్వితీయాధ్యాయము
  3. తృతీయాధ్యాయము
  4. చతుర్థాధ్యాయము
  5. పంచమాధ్యాయము
  6. షష్ఠాధ్యాయము
  7. సప్తమాధ్యాయము
  8. చరమావస్థ

మూలాలుసవరించు

తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: