నామినేషన్
ఒక కార్యాలయ ఎన్నిక కోసం గాని, లేదా గౌరవం లేదా అవార్డ్ కోసం గాని అభ్యర్థి ఎంపిక ప్రక్రియ యొక్క భాగం నామినేషన్. సేకరించిన నామినేషన్లలలో అభ్యర్థుల పూర్తి జాబితాను కుదించి అర్హమైన అభ్యర్థుల జాబితాను స్పష్టం చేస్తారు.
రాజకీయాలు
మార్చుప్రభుత్వ ఎన్నికల సందర్భంలో, ఒక రాజకీయ పార్టీ ఎంపిక చేయబడిన అభ్యర్థిని పార్టీ అభ్యర్థి అని చెబుతారు. రాజకీయపార్టీ తమ అభ్యర్థి ఎంపికను సాధారణంగా ఎన్నికల చట్టాల నియమాల ప్రకారం రాజకీయ పార్టీ సదస్సుల లేదా సమాలోచనల ఆధారితంగా నిర్ణయిస్తుంది. కొన్ని చట్ట పరిధులలో ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి సాధారణ ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై పార్టీ గుర్తింపు హక్కుతో కనిపిస్తాడు. సాధారణంగా అభ్యర్థులు ఏ రాజకీయ పక్షానికి చెందని వారుగా ఉంటారు, అయితే అభ్యర్థి పార్టీ తరపున నామినేషన్ వేసినప్పుడు పార్టీ తరపున పార్టీ ధ్రువీకరణ దరఖాస్తు ఫారం సమర్పించవలసి ఉంటుంది, ఈ పత్రాన్ని బి-ఫారం అంటారు.