నారా బ్రహ్మణి ఒక వ్యాపార వేత్త.[1] హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది.[2] తన తండ్రి నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ట్రస్ట్ కి బోర్డు మెంబర్ గా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ భార్య.[3] స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్  నుండి 2013 లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన తరువాత కొంత కాలం వెర్టెక్స్ వెంచర్ మేనేజ్‌మెంట్ లో ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ గా పనిచేసింది. తరువాత 2011 లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ - బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించింది. ప్రస్తుతం హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్, హెరిటేజ్ ఫిన్‌లీస్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెగాబిడ్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లలో డైరెక్టర్ గా కొనసాగుతున్నది.

మూలాలు

మార్చు
  1. support@instafinancials.com, InstaFinancials (2016-04-19). "NARA BRAHMANI - DIN 02338940 - Director Details". InstaFinancials (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  2. "హెరిటేజ్ ను నారా బ్రహ్మణి అమ్మేస్తారా..?". indiaherald.com. Retrieved 2023-09-15.
  3. K, Mamatha (2023-04-27). "Nara Brahmani : తాతకు తగ్గ మనవరాలు ..వ్యాపార దిగ్గజం ..మకుటం లేని మహారాణి". TeluguStop.com. Retrieved 2023-09-15.