నార్క్-మరాష్ జిల్లా
నార్క్-మరాష్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగర మధ్యభాగానికి తూర్పున ఉంది. ఈ జిల్లాకు సరిహద్దులుగా పశ్చిమ, ఉత్తరాన కెంట్రాన్, తూర్పున నార్ నార్క్, దక్షిణాన ఎరెబుని జిల్లాలు ఉన్నాయి. నార్క్-మరాష్ అనే నామము యెరెవాన్ లోని నార్క్ నుండి, మార్ష్ అనే టర్కీ లోని నగరం నుండి వచ్చాయి.[1] ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది, అవి: నార్క్, నార్క్ మరాష్.
నార్క్-మరాష్
Նորք-Մարաշ | |
---|---|
Coordinates: 40°10′27″N 44°32′27″E / 40.17417°N 44.54083°E | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం) | యెరెవన్ |
Government | |
• జిల్లా మేయర్ | వరజ్డాత్ మకర్త్యాన్ |
విస్తీర్ణం | |
• Total | 4.60 కి.మీ2 (1.78 చ. మై) |
జనాభా (2011 జనాభా) | |
• Total | 12,049 |
• జనసాంద్రత | 2,600/కి.మీ2 (6,800/చ. మై.) |
Time zone | UTC+4 (AMT) |
ఈ జిల్లాను నార్క్, నార్క్ మరాష్ లను కలిపి 1996లో స్థాపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 12,049 మంది నాలుగు (4) చ.కి. వైశాల్యంలో నివసిస్తునారు.
వీధులు, ఆనవాళ్లు
మార్చుప్రధాన వీధులు
మార్చు- గరీగిన్ హోవ్సేప్యాన్ వీధి.
- అర్మెనాక్ అర్మెనాక్యాన్ వీధి.
- డేవిడ్ బెక్ వీధి.
ఆనవాళ్లు
మార్చు- పవిత్ర దేవుని తల్లి చర్చి, 1995 లో ప్రారంభమైంది.
- ఆర్మేనియా పబ్లిచ్ టి.వి., యెరెవాన్ టి.వి. టవరు.
- నార్క్-మరాష్ మెడికల్ సెంటర్.
గ్యాలరీ
మార్చు-
పవిత్ర దేవుని తల్లి చర్చి
-
నాగోర్నో-కరబఖ్ వార్ మెమోరియల్
-
నార్క్-మరాష్ జిల్లా నాధారణ దృశ్యం