నాస్తిక కేంద్రం

సామాజిక మార్పు సంస్థ నాస్తిక కేంద్రం [1] గోరా, సరస్వతీ గోరా చే 1940లో కృష్ణా జిల్లాలో ముదునూరు గ్రామంలో స్థాపించబడింది. స్వాతంత్ర్యం వచ్చే సమయాన విజయవాడకు తరలించబడి, నాస్తిక వాదం, మానవతా వాదం, సామాజిక మార్పులకు కేంద్రస్థానంగా మారింది. గోరా 1975 లో చనిపోయినతరువాత, సరస్వతీ గోరా మార్గదర్శకత్వంలో సమగ్ర గ్రామీణాభివృద్ధికి,, మతనిరపేక్ష, మానవాతవాద మూలాలపై జీవనాన్ని అలవరచుకోవాటానికి పాటుబడింది. ఈ కేంద్రం విజయవాడలో బెంజి సర్కిల్ దగ్గర ఉంది.

ముదునూరులో నాస్తిక కేంద్ర స్థాపకులు గోరా దంపతులు

ప్రపంచంలోని హేతువాద, నాస్తికోద్యమాలను ఈ నాస్తిక కేంద్రం ప్రభావితం చేసింది. దేశం వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది సభ్యులున్నారు. 2020లో 80 సంవత్సరాల మహోత్సవాలు జరుపుకున్నది [2].

ధ్యేయం, లక్ష్యాలుసవరించు

ధ్యేయం
  • మూఢనమ్మకాల నిర్మూలన, హేతువాద, శాస్త్రీయ, మతాతీత దృక్పధం నెలకొల్పట ద్వారా ధనాత్మక నాస్తికత్వాన్ని మానవతావాదాన్ని జీవనవిధానంగా మార్చటానికి తోడ్పడే సామాజిక మార్పు సంస్థ.
లక్ష్యాలు (కొన్ని)
  • విద్య ద్వారా శాస్త్రీయ, మతాతీత, ప్రజాస్వామిక, ప్రాపంచిక దృక్పధం పెంపొందిచటం ద్వారా బాధ్యత తెలిసిన, సమాజంలో విధులు తెలుసుకున్న మంచి పౌరులను తయారుచేయడం
  • వివిధ స్థాయిలలో విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి నియత, అనియత, ప్రయోగాత్మక విద్య ద్వారా, వయోజన విద్య, సామాజిక విద్య, స్వంత కాళ్లపై నిలబడడానికి నైపుణ్యాలు నేర్పటం
  • హేతువాద, మతాతీత, శాస్త్రీయ, పౌర చైతన్యం పెంపొందించేందుకు సాహిత్యాన్ని సృష్టించడం, ముద్రించడం

ఇవీ చూడండిసవరించు

వనరులుసవరించు

  1. "నాస్తిక కేంద్రం జాలస్థలి". Retrieved 2020-01-15.
  2. "80 వ‌సంతాల నాస్తి‌క కేంద్రం". ప్రజాశక్తి. 2020-01-03. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.