నా జీవిత యాత్ర

ఆత్మకథ

ఆంధ్రకేసరి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ నా జీవిత యాత్ర. తెలుగునాట స్వాతంత్రోద్యమ నిర్మాణానికి, కాంగ్రెస్ పార్టీ మనుగడకు తన యావదాస్తినీ త్యాగం చేసిన మహావ్యక్తిగా దేశ చరిత్రలో ఆయన స్థానం పొందారు. ఆయన ఆత్మకథ ద్వారా ప్రకాశం వ్యక్తిత్వం, ఆనాటి సాంఘిక స్థితిగతులు, తెలుగులో జాతీయోద్యమం, కాంగ్రెస్ పార్టీలో ఆనాడు సాగిన అంతర్గత వ్యవహారాలు వంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు.[1]

నా జీవిత యాత్ర
కృతికర్త: టంగుటూరి ప్రకాశం
తెన్నేటి విశ్వనాధం
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): ఆత్మకథ
ప్రచురణ: ఎమెస్కో
విడుదల: 1972
పేజీలు: 894

రచన నేపథ్యం

మార్చు

టంగుటూరి ప్రకాశం పంతులు తన ఆత్మకథను వ్రాసి 1949లో ప్రచురించారు. ఈ ఆత్మకథలోని మూడువంతుల భాగాన్ని ప్రకాశం రాయగా, ఆయన పనులవత్తిడి, ఆపైన అనారోగ్యంతో మరణం పొందడంతో మిగిలిన భాగాన్ని ప్రకాశం అనుంగు శిష్యుడు తెన్నేటి విశ్వనాథం వ్రాసి పూర్తిచేశారు.

తర్వాత 1972 సంవత్సరంలో ఎమెస్కో బుక్స్ వారు నాలుగు భాగాల్ని ఒకటిగా చేసి ముద్రించారు.

పుస్తక విశేషాలు

మార్చు

పేద కుటుంబంలో జన్మించి అత్యంత కష్టభాజనమైన జీవితాన్ని బారిస్టరు చదువు వరకూ నడిపించిన ప్రకాశం 20వ దశకం తొలినాళ్లలో మద్రాసులో విపరీతంగా డబ్బు, పేరు సంపాదించిన న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నారు. తన వృత్తి శిఖరాయమానంగా ఉండగా ఆ రోజుల్లోనే లక్షాధికారియైనా గాంధీ పిలుపునందుకుని దేశం కోసం వృత్తిని, ఆపైన స్వరాజ్య పత్రికను నిర్వహించడంలో సమస్త సంపదనూ త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ చరిత్ర ఆయన పేరు లేకుండా సాగదు.

ప్రాచుర్యం, ప్రాధాన్యత

మార్చు

నిజానికి కొందరు నాయకులు ప్రకాశం జీవితానికి, ఆంధ్రదేశంలో జాతీయోద్యమానికి భిన్నత్వం లేదన్నారంటే ఆయన స్థాయి తెలుస్తుంది. అటువంటి నాయకుని జీవితచరిత్ర ప్రామాణిక చరిత్రలకు ముడిసరుకు కాగలదు. జాతీయ నాయకుల గురించీ, పరిణామాల గురించి లోపలి వ్యక్తిగా ఈ పుస్తకంలో ప్రకాశం కొత్తకోణాలను ఆవిష్కరిస్తారు.

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: