నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం
నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం డా. ఎం. ఎఫ్. గోపీనాథ్ తన సామాజిక అనుభవాల గురించి రాసిన పుస్తకం.
నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం | |
గోపీనాథ్ పుస్తక ముఖచిత్రం. | |
కృతికర్త: | ఎం. ఎఫ్. గోపీనాథ్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఆత్మకథ, అనుభవాలు, జ్ఞాపకాలు |
విభాగం (కళా ప్రక్రియ): | వ్యక్తిగత అనుభవాలు |
ప్రచురణ: | హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ |
విడుదల: | సెప్టెంబర్ 28 2013, బషీర్ బాఘ్ ప్రెస్ క్లబ్ |
పేజీలు: | 162 |
అల్లం రాజయ్య రాసిన ముందుమాట
మార్చుఈ పుస్తకానికి ముందుమాటలో అల్లం రాజయ్య ఇలా రాసాడు: "పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన ` ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు ` అలాంటి ఒంటరితనాల్లోంచి ` సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం"