ఎం. ఎఫ్. గోపీనాథ్

డా.యం ఎఫ్. గోపీనాథ్ తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు[ఆధారం చూపాలి]

డా. యం ఎఫ్. గోపీనాథ్
జననం1954 జూన్ 9, 1954
నివాసంఅయ్యవారిపల్లి, ఖమ్మం
జాతీయతభారతీయులు
రంగములుగుండె జబ్బుల నిపుణుడు కార్డియోలజిస్ట్
వృత్తిసంస్థలుస్పందన హాస్పిటల్స్ ఖమ్మం ఆంధ్ర ప్రదేశ్
చదువుకున్న సంస్థలుఉస్మానియా మెడికల్ కాలేజి, హైదరాబాద్,ఇండియా

జీవితసంగ్రహం

మార్చు

గోపీనాథ్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS, MD చేసారు, పోస్ట్ డాక్టోరల్ DM కోర్సు కేరళ లోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చేసారు. తెలంగాణా లోని . ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామంలో జన్మించిన ఇతను రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా దళిత, విప్లవ విద్యార్థి రాజకీయాల్లో పనిచేసారు.

ఎమర్జెన్సీ ఎత్తివేత తరువాత రాడికల్‌ విద్యార్థులు ‘రోడ్‌ టూ రెవల్యూషన్‌’లో భాగంగా తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపీనాథ్ 1978 ఫిబ్రవరిలో రాడికల్‌ విద్యార్థి సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్‌ (ఆజాద్‌) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1982లో మద్రాసులో ‘నేషనాలిటీ క్వశ్చన్‌ ఇన్‌ ఇండియా’ మీద అఖిల భారత విద్యార్థి సెమినార్‌ ఏర్పాటు మొదలు విద్యార్థి ఉద్యమం అఖిల భారత స్థాయిలో ఏర్పాటుదాకా రాజ్‌కుమార్‌, గోపీనాథ్ లాంటివాళ్లు పూనుకుని చేసినవి. గోపీనాథ్ 1978 నుండి 1982 దాకా అనేక మహత్తర పోరాటాలు చేసిన రాడికల్‌ విద్యార్థి సంఘానికి నాయకుడుగా ఉన్నాడు. రాడికల్ విద్యార్థి సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడుగాను, తర్వాత రెండు పర్యాయాలు అధ్యక్షుడిగానూ పనిచేసారు. మొదట ఖమ్మంలోను, ఆ తర్వాత న్యూఢిల్లీలో నిమ్స్ లోనూ పనిచేసారు. సొంతంగా ఖమ్మంలో స్పందనా హార్ట్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసారు. ఫూలే, అంబేద్కర్ జాతీయ అధ్యయన సంస్థ ఏర్పాటు చేసి ఫూలే అంబేద్కర్ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నారు.

రచనలు

మార్చు
  1. కులాంకలీ
  2. నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం : భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు.
  3. నా మంచం నాఇష్టం!