నిజాంపేట్ మండలం (సంగారెడ్డి జిల్లా)

నిజాంపేట్‌ మండలం తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండల కేంద్రం.[1] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా నిజాంపేట్‌ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]

నిజాంపేట్ మండలంలోకి కల్హేర్‌ మండలం నుండి 10 గ్రామాలు, నారాయణఖేడ్‌ మండలం నుండి 6 గ్రామాలు, పెద్దశంకరంపేట మండలం నుండి ఒక గ్రామ పంచాయతీని విలీనం చేసి నూతన మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మూలాలు

మార్చు
  1. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
  2. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  4. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు