నితేష్ రాణే
నితేష్ నారాయణ్ రాణే (జననం 23 జూన్ 1982) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కంకవ్లి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నితేష్ నారాయణ్ రాణే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 అక్టోబర్ 2014 | |||
ముందు | ప్రమోద్ జాతర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కంకవ్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1982 జూన్ 23||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2019 వరకు) | ||
జీవిత భాగస్వామి | రుతుజా రాణే (వివాహం, 2007) | ||
బంధువులు | నారాయణ్ రాణే (తండ్రి) నీలేష్ రాణే (సోదరుడు) | ||
నివాసం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చునితేష్ రాణే తన తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి & మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే[2] అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ ప్రమోద్ జాతర్‌పై 25,979 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన అక్టోబర్ 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సతీష్ జగన్నాథ్ సావంత్‌పై 28116 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
నితేష్ రాణే 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి సందేశ్ పార్కర్‌పై 58,007 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "The 10 BJP dynasts who have won in Maharashtra" (in ఇంగ్లీష్). Rediff. 24 October 2019. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ Jore, Dharmendra (25 September 2010). "Nitesh Rane: His father's son". Mumbai: Hindustan Times. Archived from the original on 28 November 2011. Retrieved 4 April 2013.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.