నిన్ను తలచి
నిన్ను తలచి 2019లో తెలుగులో విడుదలైన సినిమా. ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనిల్ తోట దర్శకత్వంలో ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.[1] వంశీ యకసిరి, స్టెఫి పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 1న విడుదల చేసి[2] సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేశారు.[3][4]
నిన్ను తలచి | |
---|---|
దర్శకత్వం | అనిల్ తోట |
స్క్రీన్ ప్లే | అనిల్ తోట |
నిర్మాత | ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి |
తారాగణం | వంశీ యకసిరి, స్టెఫి పటేల్ |
ఛాయాగ్రహణం | వాసిలి శ్యాం ప్రసాద్ |
కూర్పు | సాయిబాబా తలారి, అనిల్ తోట |
సంగీతం | యల్లెందర్ మహవీర |
నిర్మాణ సంస్థలు | ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2019 సెప్టెంబర్ 27 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅభిరామ్ (వంశీ యాకసిరి) అల్లరిచిల్లరగా తిరుగే కుర్రాడు. అంకిత (స్టెపీ పటేల్)ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి ఆమెను ప్రేమలో పడేయడానికి అభి ఏమి చేశాడు ? ఆ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంకిత మనసులో వేరే అతను ఉన్నారని అభికి తెలుస్తోంది ? దాంతో అభి ఎమి చేశాడు ? అసలు అంకిత మనసులో ఉన్నది ఎవరు ? అంకిత అభితో ప్రేమలో పండిందా ? చివరికి అంకిత అభి ఒక్కటయ్యారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
మార్చు- వంశీ యకసిరి
- స్టెఫి పటేల్
- ఆనంద్
- కృష్ణ తేజ
- నవీన్ నేని
- ఆయుష్ గుప్తా
- కేదార్ శంకర్
- మహేష్ ఆచంట
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్
- నిర్మాత: ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ తోట
- సంగీతం: అనిల్ తోట
- సినిమాటోగ్రఫీ: వాసిలి శ్యాం ప్రసాద్
- పాటలు: పూర్ణాచారి, శ్రీమణి
మూలాలు
మార్చు- ↑ Sakshi (25 September 2019). "మంచి సినిమాని ప్రోత్సహించాలి". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Zee News Telugu (1 February 2019). "నిన్ను తలచి మూవీ టీజర్". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (27 September 2019). "Ninnu Thalachi Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (17 August 2017). "'Ninnu Thalachi' gearing up for a grand release in September" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (2019). "'Ninnu Thalachi' review: A breezy romantic entertainer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.