నిమ్మక గోపాలరావు

నిమ్మక గోపాలరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

నిమ్మక గోపాలరావు

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1985
1989 - 2004
నియోజకవర్గం కొత్తూరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1943 జూన్ 1
ఎం.రాజపురం, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 28 ఆగష్టు 2010[1]
హైదరాబాద్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి నిమ్మక రమణమ్మ
సంతానం ముగ్గురు (నిమ్మక జయకృష్ణ)

రాజకీయ జీవితం

మార్చు

నిమ్మక గోపాలరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1985లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 1994,1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌గా, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరక్టర్‌గా, రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Ex TDP MLA Nimmaka No More". 28 August 2010. Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  2. "నిమ్మక గోపాలరావు". 20 February 2013. Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.