నిమ్మగడ్డ రమేష్ కుమార్

1982 ఐఎఎస్ అధికారి

నిమ్మగడ్డ రమేష్ కుమార్, నవ్యాంధ్ర తొలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ గా 2016 ఏప్రిల్ 1 న బాధ్యతలు చేపట్టాడు. 1982 లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా వృత్తి ప్రారంభించిన అతను దీనికి ముందు గవర్నరుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా కూడా పనిచేశాడు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్
నిమ్మగడ్డ రమేష్ కుమార్


నవ్యాంధ్ర 3వ ప్రధాన ఎన్నికల కమీషనర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
31 జులై 2020
ముందు కనగరాజ్

నవ్యాంధ్ర 1వ ప్రధాన ఎన్నికల కమీషనర్
పదవీ కాలం
1 ఏప్రిల్ 2016 – 10 ఏప్రిల్ 2020
తరువాత కనగరాజ్

గవర్నరు కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
17 మార్చి 2009 – 31 మార్చి 2016

వ్యక్తిగత వివరాలు

జననం (1956-03-08) 1956 మార్చి 8 (వయసు 68)[1]
నివాసం హైదరాబాదు
వృత్తి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

చదువు

మార్చు

బిఎ (చరిత్ర), ఎల్ ఎల్ బి (లా), పిజి (ఆర్ధికశాస్త్రం) చదివాడు. [1]

వృత్తి

మార్చు

1982 లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు ఎంపికయ్యాడు. 1984 లో సబ్ కలెక్టరుగా వృత్తిని ప్రారంభించి వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా పనిచేశాడు. చివరిగా గవర్నరుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, 2016 మార్చి 31న పదవీ విరమణ చేశాడు.[1]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియామకం

మార్చు

2016 ఏప్రిల్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నివృత్త ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించబడ్డాడు.[2]2020 మార్చి లో MPTC/ZPTC, ఎన్నికలు ప్రారంభమై తొలిదశ నామినేషన్ల ముగింపు తర్వాత, కరోనా కారణంగా నిమ్మగడ్డ ఎన్నికలను నిలుపుదల చేశారు. ఇది రాష్ట్రప్రభుత్వ కోరికకు వ్యతిరేకంగా వుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ పదవికాలాన్ని మూడు సంవత్సరాలకు పరిమితం చేసి, నివృత్త హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలని ఆర్డినెన్స్ చేసి, నిమ్మగడ్డను అర్ధంతరంగా విధులనుంచి తప్పించి, విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించింది. [3] దీనిగురించి హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివాదం నడచి, హైకోర్టు ఉత్తర్వుమేరకు (సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి) నిమ్మగడ్డను మరల నియమించారు.[4] ఆ విధంగా మూడవ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా 2020 జులై 31 న మరల పదవీబాధ్యతలు చేపట్టాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Nimmagadda Ramesh - Kumar Biodata". NIC. Archived from the original on 2021-02-03. Retrieved 2021-01-30.
  2. "Ramesh Kumar takes office as new Andhra SEC". The Hindu. 2016-04-01. Retrieved 2021-01-30.
  3. "జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ నియామకం". సమయం. 2020-04-11. Retrieved 2021-01-30.
  4. "అర్ధరాత్రి ఉత్తర్వులు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం." వన్ ఇండియా. 2020-07-31. Retrieved 2021-01-23.

ఇవీ చూడండి

మార్చు