నిమ్మ రాజిరెడ్డి

నిమ్మ రాజా రెడ్డి, (మీడియాలో నిమ్మ రాజి రెడ్డిగా కూడా సుపరిచితుడు) (1937 మార్చి 9 - 2009 అక్టోబరు 19) వరంగల్లు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేసాడు. రెండు దశాబ్దాల పాటు చేర్యాల నియోజకవర్గం కి ప్రాతినిధ్యం వహించాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా తన సేవలనందించాడు.

నిమ్మ రాజిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి
జననం(1937-03-09)1937 మార్చి 9
మరణం2009 అక్టోబరు 19(2009-10-19) (వయసు 72)
చేర్యాల , వరంగల్ జిల్లా
సమాధి స్థలంవెల్ధంద, చేర్యాల , వరంగల్
జాతీయతభారతదేశం
ఇతర పేర్లునిమ్మ
వృత్తిశాసనసభ్యుడు, మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామినిమ్మ రమాదేవి

జీవిత విశేషాలు మార్చు

అతను వరంగల్ జిల్లాలో 1937 మార్చి 9వ తేదీన జన్మించాడు. సర్పంచి స్థానం నుంచి రాష్ట్ర మంత్రి వరకు పదవులు పొందినాడు. 1983 నుంచి చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో జౌళిశాఖ మంత్రిగా, విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేశారు. అతను అక్టోబరు 19, 2009న మరణించాడు.

రాజకీయ పదవులు మార్చు

అతను 1962లో తన 25వయేట రాజకీయాలలోకి ఇండిపెండెంట్ గా ప్రవేశించాడు.

  • 1962–64 – వరంగల్ జిల్లా,చెరియాల్ మండలం వెల్దండ పంచాయితీకి సర్పంచ్ గా రెండు సంవత్సారాలు ఉన్నాడు.
  • 1964–1978 – 14 సంవత్సరాల పాటు నార్మెట్టకు పంచాయితీరా ప్రెసిడెంటు.
  • 1978 – మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ
  • 1978–1982 – వరంగల్ లోని చెరియాల్ లో బ్యాంకు చైర్మన్
  • 1982 – నందమూరి తారకరామారావు అధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ లో చేరిక.
  • 1978–1999 – 21 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా ఎన్నిక. అతను చెరియాల్ శాసన సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసాడు.

రాజకీయ జీవితం మార్చు

అతను వృత్తిపరంగా న్యాయవాది అయిన నిమ్మ రాజిరెడ్డి 25 సంవత్సరాల వయస్సు నుండి తన ప్రాంతానికి నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పదవులలో పనిచేశాడు. మొదట గ్రామ సర్పంచ్ గా, తరువాత సమితి అధ్యక్షుడిగా, తరువాత బ్యాంక్ చైర్మన్ గా గెలిచాడు. అతను 1978 లో అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారి పోటీ చేసాడు. ఆ తరువాత 1983 లో పోటీ చేసి తెలుగు దేశం పార్టీ కోసం నాలుగు సార్లు వరుసగా గెలిచాడు. రెండు దశాబ్దాలుగా వరంగల్ జిల్లాలో చెరియల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, విద్యుత్ & చేనేత మంత్రి గా రెండు శాఖలకు మంత్రిగా కూడా పనిచేశాడు.

1999 లో ఎన్. టి. రామారావుపై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు తరువాత రాజిరెడ్డి చంద్రబాబు నాయుడు తిరుగుబాటుకు మద్దతు ఇవ్వనందుకు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్. టి. రామారావుకు మద్దతు ఇచ్చినందుకు అసెంబ్లీ టిక్కెట్‌ను తిరస్కరించాడు. అప్పటి నుండి చెరియాల్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గంలో విలీనం జరిగే వరకు తెలుగు దేం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ నాయకుడూ చెరియల్ నియోజకవర్గాన్ని గెలవలేదు.

చెరియల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుపై నిమ్మ రాజారెడ్డి వ్యతిరేకత వల్ల లాభించలేదు. అతను తెలంగాణ ఉద్యమానికి కూడా గట్టిగా మద్దతు ఇచ్చాడు. తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన తరువాత కూడా మద్దతు ఇచ్చాడు. ఏప్రిల్ 2004 లో చంద్రబాబు నాయుడు అతనిని సీనియర్ సభ్యులైన ధరూర్ పుల్లయ్య, సి. లక్ష్మీ నరసింహరెడ్డితో లతో పాటు పార్టీ నుండి బహిష్కరించాడు.[1] 2009 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అతను దానిని వ్యతిరేకించాడు. చంద్రబాబు నాయుడుపై తన శత్రుత్వాన్ని చూపించడానికి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. చెరియాల్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గంలో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు 2009 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు.

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh: Briefly: TDP expels former Minister". The Hindu. 20 April 2004. Archived from the original on 1 ఆగస్టు 2004. Retrieved 4 February 2013.