నిర్గమకాండము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనాను దేశానికి బయలు వెళ్ళిన చరిత్రను తెల్పుతుంది. "నిర్గమము" అనగా బయటకు వెళ్ళడం. దీన్ని మోషే రాసాడు. ఇది బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యలో రాయబడింది.[1] దీనిలో చెప్పబడ్డ విషయాలు: దాస్యములో ఇశ్రాయేలు ప్రజల బాధలు, మోషే ప్రవక్త నాయకత్వము, ఐగుప్తులో మోషేద్వారా దేవుడు జరిగించిన పది అద్భుతాలు, దాసులకు విడుదల, ఐగుప్తు నుంచి ప్రయాణం, ఎడారిలో దేవుడు చేసిన ఒడంబడిక, అద్భుతాలు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, ఇశ్రాయేలు ప్రజలమధ్య దేవుని నివాసం, మొదలగునవి.[1] నిర్గమకాండము చీకటితో ప్రారంభమై మహిమతో ముగియుచున్నది.

పుస్తక విభజన మార్చు

  • 1-2  : ఇశ్రాయేలీయుల బానిసత్వము- మోషే జననం
  • 3- 12  : మోషే పిలుపు- ఐగుప్తు అద్భుతాలు
  • 13-14 :పస్కా – ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం
  • 15- 18  : ఎర్ర సముద్రం నుండి సీనాయి ప్రయాణం
  • 19- 40 : ఇశ్రాయేలు సీనాయి పర్వతం వద్ద

మూలాలు మార్చు