నిర్భయ్ క్షిపణి

(నిర్భయ్‌ క్షిపణి నుండి దారిమార్పు చెందింది)

నిర్భయ్‌ ఒక దూర పరిధి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది.

నిర్భయ్‌ క్షిపణి
నిర్భయ్‌ క్రూయిజ్ క్షిపణి
రకందూర పరిధి, అన్ని కాలాల, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి[1][2]
అభివృద్ధి చేసిన దేశం భారతదేశం
సర్వీసు చరిత్ర
వాడేవారుభారతీయ నౌకా దళం
భారత సైన్యం
భారతీయ వాయు సేన
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుDRDO
తయారీ తేదీతెలియదు పరీక్షల దశలోనే ఉంది
విశిష్టతలు
బరువు1,000 kg[3]
పొడవు6 మీ
వ్యాసం0.52 మీ

ఇంజనుturbofan
వింగ్‌స్పాన్2.84 మీ
ఆపరేషను
పరిధి
1,000 km[1][3]
వేగంమ్యాక్ 0.8
గైడెన్స్
వ్యవస్థ
INS

వివరణ

మార్చు

నిర్బయ్ తక్కువ ఖర్చుతో, అన్నికాలాలలో, రహస్యంగా, కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించ గల సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీని పరిధి 1000 కి.మీ. బరువు ఒక టన్ను (1000 కి.గ్రా.), పొడవు 6 మీ. కచ్చితమైన గమనం కోసం రింగ్ లేజర్ గైరోస్కోప్, కచ్చితమైన ఎత్తును కొలిచేందుకు రేడియో ఆల్టిమీటర్ ను ఈ క్షిపణిలో అమర్చారు.

ప్రయోగాలు

మార్చు

ఇప్పటి వరకు ఆరు నిర్భయ్ పరీక్షలు జరపగా మూడు విఫలమయ్యాయి. మూడు విజయవంతమయ్యాయి. ఆ వివరాలివి:

  • మొదటి పరీక్ష– 2013 మార్చి 12– విఫలం– ప్రయాణంలో ఉండగా క్షిపణి కూలిపోయింది
  • రెండవ పరీక్ష – 2014 అక్టోబరు 17– విజయవంతం – 100% పనితనం
  • మూడవ పరీక్ష– 2015 అక్టోబరు 16 – విఫలం - క్షిపణి కూలిపోయింది
  • నాలుగవ పరీక్ష - 2016 డిసెంబరు 21 - విఫలం - క్షిపణి కూలిపోయింది[4][5][6]
  • 2017 నవంబరు 7 న నిర్వహించిన ఐదవ పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షలో నిర్భయ్ క్షిపణి 50 నిముషాల పాటు ప్రయాణించి, 647 కి.మీ. దూరాన్ని అధిగమించింది.[7]
  • 2019 ఏప్రిల్ 15 న జరిగిన ఆరవ పరీక్షలో నిర్భయ్ క్షిపణి 650 కి.మీ. దూరం ప్రయాణించింది. పరీక్ష స్ంపూర్ణంగా విజయవంతమైనట్లు డిఆర్‌డివో ప్రకటించింది.[8] నేలను హత్తుకుంటూను, నీటిపై రాసుకుంటూనూ ప్రయాణించ గల సామర్థ్యాలను కూడా ఈ ప్రయోగంలో విజయవంతంగా పరీక్షించారు.[9] దీనితో నిర్భయ్ క్షిపణి అభివృద్ధి పరీక్షలు పూర్తయ్యాయి. తరువాతి పరీక్షలు భారత రక్షణ దళాల అవసరాల మేరకు నిర్వహిస్తారు.[10]

మోహరింపు

మార్చు

2020 సెప్టెంబరులో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారతదేశం, తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నిర్భయ్ క్షిపణులను పరిమిత స్థాయిలో మోహరించింది. దీనితో పాటు బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులను కూడా మోహరించింది.[11][12]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "India to Test Nirbhay Cruise Missile in 2012". Rusnavy. November 2011. Retrieved 10 March 2012.
  2. "India Develops Sub-sonic Stealth Cruise Missile". Archived from the original on 2012-03-10. Retrieved 2014-02-05.
  3. 3.0 3.1 "Nirbhay Cruise Missile". Indian Defense Projects Sentinel. Mar 7, 2012. Archived from the original on 2013-06-05. Retrieved March 10, 2012.
  4. "Nirbhay missile test "an utter failure"". Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Subsonic cruise missile Nirbhay flight test fails". Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Nuclear-capable Nirbhay cruise missile's test fails for the fourth time". Archived from the original on 2016-12-21. Retrieved 2016-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "India conducts successful flight test of Nirbhay cruise missile". Archived from the original on 2017-11-08. Retrieved 2017-11-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "పాకిస్థాన్ గుండెల్లో పిడుగు వేసిన భారత్...నిర్భయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్". న్యూస్18 తెలుగు. 2019-04-15. Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-29.
  9. "Sub-sonic cruise missile 'Nirbhay' successfully test-fired". The Hindu (in Indian English). Special Correspondent. 2019-04-16. ISSN 0971-751X. Retrieved 2019-08-26.{{cite news}}: CS1 maint: others (link)
  10. "Nirbhay cruise missile to be tested with 'desi' engine in future". The Week. 16 April 2019. Retrieved 26 August 2019.
  11. "డ్రాగన్‌పై 'నిర్భయ' గురి..!". www.eenadu.net. Retrieved 2020-09-29.
  12. "ఎల్‌ఏసీకి బ్రహ్మోస్‌ క్షిపణి". ఆంధ్రజ్యోతి. 2020-09-29. Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-29.