క్రూయిజ్ క్షిపణి

క్రూయిజ్ క్షిపణి, భూమ్మీది లక్ష్యాలను ఛేదించడానికి వాడే గైడెడ్ క్షిపణి. ఈ క్షిపణి ప్రయాణమంతా భూవాతావరణంలోనే సాగుతుంది. ప్రయాణ మార్గం చాలావరకు ఒకే వేగంతో సాగుతుంది. పెద్ద వార్‌హెడ్‌ను, చాలా దూరాన, చాలా ఎక్కువ కచ్చితత్వంతో ప్రక్షేపించేలా క్రూయిజ్ క్షిపణిని రూపొందించారు. ఆధునిక క్రూయిజ్ క్షిపణులు సూపర్‌సోనిక్  వేగాలు, లేదా ఉన్నత-సబ్‌సోనిక్ వేగాల వద్ద ప్రయాణిస్తాయి. స్వీయ దిశానిర్దేశనం కలిగి, అతి తక్కువ ఎత్తులో, రాడార్లకు అందకుండా ప్రయాణించే సామర్థ్యం కలిగిన క్షిపణులివి. 

అమెరికా Tomahawk cruise missile
Taurus KEPD 350 cruise missile of the Luftwaffe

మానవరహిత వైమానిక వాహనాల కంటే క్రూయిజ్ క్షిపణులు విభిన్నమైనవి: క్రూయిజ్ క్షిపణి ఒక్కసారి వాడేందుకు మాత్రమే పనికొస్తుంది. దాడిలో అది ధ్వంసమై పోతుంది. అది గాల్లో ఉండి గస్తీ కాసేందుకు పనికిరాదు. దీని వార్‌హెడ్ క్షిపణితో సమైక్యమై ఉంటుంది, విడదీయడానికి కుదరదు. లక్ష్యాల పరంగా చూస్తే క్రూయిజ్ క్షిపణికి, నౌకా  విధ్వంసక క్షిపణికీ దగ్గరి పోలికలున్నాయి.

చరిత్ర మార్చు

రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ప్రయోగించిన వి-1 ప్లయింగ్ బాంబ్ మొట్టమొదటి క్రూయిజ్ క్షిపణి. ట్రాన్సిస్టర్లు, కంప్యూటర్లలో సాధించిన పురోగతి కారణంగా, గాల్లో ప్రయాణంలో ఉండగానే దిశను మార్చుకోగల సామర్థ్యాన్ని క్రూయిజ్ క్షిపణులు సాధించాయి. ఈ సాంకేతిక ప్రగతి కారణంగా, గైడెడ్ బాంబులు, గైడెడ్ క్షిపణులూ తయారై, చివరికి ఆధునిక క్రూయిజ్ క్షిపణి రూపొందింది.

 
A Fieseler Fi-103, the German V-1 flying bomb

సాధారణ డిజైను  మార్చు

సాధారణంగా క్రూయిజ్ క్షిపణిలో గైడెన్స్ వ్యవస్థ, పేలోడు, వైమానిక ప్రొపల్షను వ్యవస్థ ఉంటాయి. ఎయిర్‌ఫ్రేముకు చిన్న రెక్కలు, తోక అమర్చి ఉంటాయి. ఇవి గమన నియంత్రణకు (ఫ్లైట్ కంట్రోల్) పనికొస్తాయి. పేలోడుగా సాంప్రదాయిక లేదా అణు వార్‌హెడ్ ఉంటుంది. క్రూయిజ్ క్షిపణులు జెట్ ఇంజన్లతో పనిచేస్తాయి. తక్కువ ఎత్తులో సమర్థంగా పనిచేసే టర్బోఫ్యాన్ ఇంజన్లు వీటికి మరింత అనుకూలం.

రకాలు మార్చు

క్రూయిజ్ క్షిపణులను వాటి పరిమాణం, వేగం (సబ్‌సోనిక్, సూపర్‌సోనిక్), పరిధి, ప్రయోగ వేదిక మొదలైన అంశాలను బట్టి వర్గీకరించవచ్చు. ఒకే క్షిపణిని వివిధ  ప్రయోగ  వేదికలకు అనుగుణంగా వివిధ రూపాల్లో తయారుచేస్తారు. గాల్లో నుండి, జలాంతర్గాముల నుండీ ప్రయోగించగల రూపాలు నేలపై నుండి ప్రయోగించే రూపాల కంటే తేలికగా ఉంటాయి.

క్షిపణుల దిశానిర్దేశక వ్యవస్థల్లో ఇనర్షియల్ నేవిగేషన్, TERCOM, లేదా ఉపగ్రహ నేవిగేషన్ వంటి రకాలున్నాయి. పెద్ద క్రూయిజ్ క్షిపణులకు సాంప్రదాయిక బాంబులు, అణు బాంబులు దేన్నైనా మోసుకుపోగల సత్తా ఉండగా, చిన్న క్షిపణులు సాంప్రదాయిక బాంబులను మాత్రమే మోసుకుపోగలవు.

హైపర్‌సోనిక్ మార్చు

మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణిని హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అంటారు. కింది హైపర్‌సోనిక్ క్షిపణులు వివిధ స్థాయిల్లో అభివృద్ధిలో ఉన్నాయి.

  • Kh-90  /  గాల్లోంచి నేలపైకి ప్రయోగించే క్షిపణి. 1990ల్లో రష్యా (సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసింది. మ్యాక్ 4 నుండి మ్యాక్ 6 వరకూ వేగాన్ని అందుకునేలా రూపొందించారు..
  • బ్రహ్మోస్-2  /  భారత రష్యాలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ క్షిపణి, ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.[1]
  • శౌర్య (క్షిపణి)   బాలిస్టిక్, క్రూయిజ్ - రెండు లక్షణాలూ కలిగిన ఈ క్షిపణిని హైబ్రిడ్ క్షిపణి అనొచ్చు.[2][3] (దీనిలో వాతావారణం నుండి గాలి పీల్చుకునే ఇంజను లేదు కాబట్టి దీన్ని "నిజమైన" క్రూయిజ్ క్షిపణి అనలేం.)
  • బోయింగ్ X-51 మరో హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.
  • Yu-71 [4]
  • WU-14 హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం (DF-ZF) DF-26 నౌకా విధ్వంసక బాలిస్టిక్ క్షిపణి. [5]
  • [6]
  • పెర్సియస్ [7] / 

సూపర్‌సోనిక్ మార్చు

 
బ్రహ్మోస్ IMDS 2007 ప్రదర్శనలో

ఈ క్షిపణులు ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. సాధారణంగా రామ్‌జెట్ ఇంజన్లను వాడుతాయి. 100–500 కి.మీ. పరిధి కలిగి ఉంటాయి. దీనికి మించీ ఉండొచ్చు. గైడెన్స్ వ్యవస్థలు వివిధ  రకాలుగా ఉంటాయి.

ఉదాహరణలు

  • 3M-54 Klub   రష్యా (the "Sizzler" variant is capable of supersonic speed)
  • AGM-69 SRAM   అమెరికా
  • Air-Sol Moyenne Portée   ఫ్రాన్సు — supersonic stand-off nuclear missile
  • BrahMos  /  భారత్ / రష్యా - fastest supersonic cruise missile[8]
  • C-101   చైనా
  • C-301   చైనా
  • C-803   చైనా — supersonic terminal stage only
  • C-805   చైనా
  • CJ-10   చైనా
  • CVS401 Perseus  /  ఇంగ్లండు / ఫ్రాన్సు (Under development)  — stealth supersonic cruise missile[9][10][11][12][13]
  • KD-88   చైనా
  • Kh-31   రష్యా
  • P-270 Moskit  /  సోవియట్ యూనియన్ / రష్యా
  • P-500 Bazalt  /  సోవియట్ యూనియన్ / రష్యా
  • P-700 Granit  /  సోవియట్ యూనియన్ / రష్యా
  • P-800 Oniks  /  సోవియట్ యూనియన్ / రష్యా
  • YJ-12   చైనా
  • YJ-18   చైనా
  • YJ-91   చైనా
  • Yun Feng   Taiwan
  • Hsiung Feng III   Taiwan

ఖండాంతర పరిధి మార్చు

  • SM-62 Snark   అమెరికా
  • SM-64 Navaho   అమెరికా
  • SLAM   అమెరికా
  • RSS-40 Buran   సోవియట్ యూనియన్
  • Burya   సోవియట్ యూనియన్

దూర పరిధి మార్చు

 
అమెరికా అయిర్ ఫోర్సు యొక్క AGM-86

అమెరికా, రష్యా, ఇంగ్లండు, ఇజ్రాయిల్, దక్షిణ కొరియా, టర్కీ, గ్రీసు, ఇరాన్, చైనా, పాకిస్తాన్, భారత్‌లు దూర పరిధి గల సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేసాయి. ఈ క్షిపణుల పరిధి 1,000 కి.మీ. పైబడి ఉంటుంది. 800 కి.మీ./గంట వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. ప్రయోగ సమయాన వాటి బరువు 1,500 కి.గ్రా. ఉంటుంది. సాంప్రదాయిక, అణు వార్‌హెడ్ దేన్నైనా మోసుకుపోగలవు. తొలుత ఇనర్షియల్ నేవిగేషన్ ను వాడేవి. తరువాతి కాలంలో మరింత కచ్చితత్వం గల  TERCOM,  DSMAC వ్యవస్థలను వాడుతున్నాయి. ఇటీవలి  క్షిపణులు ఉపగ్రహ  వ్యవస్థను వాడుతున్నాయి.

ఉదాహరణలు

  • 3M14   రష్యా
  • AGM-86B   అమెరికా
  • AGM-129 ACM   అమెరికా
  • BGM-109 Tomahawk  /  అమెరికా/ఇంగ్లండు
  • DH-10   చైనా
  • హ్యున్‌మూ III   South Korea (Hyunmoo IIIA 500 km, Hyunmoo IIIB 1000 km, Hyunmoo IIIC 1500 km)
  • Kh-101   రష్యా
  • మెష్కట్ ఇరాన్ (Range 2000 km) [14]
  • నిర్భయ్   భారత్ (1000 + km)
  • పోపెయే టర్బో SLCM   ఇజ్రాయిల్
  • RK-55 మూస:Country data SUN సోవియట్ యూనియన్
  • SOM (క్షిపణి) (SOM B Block I)   టర్కీ (350 km range under serial production, 500 km + range under development) - 500 km, 1500 km and 2500 km versions [15][16][17]

మధ్యమ పరిధి సబ్‌సోనిక్ మార్చు

 
స్టార్మ్ షాడో (ఇంగ్లండు/ఫ్రాన్సు/ఇటలీ)
 
పాకిస్తాన్ బాబర్ క్రూయిజ్ క్షిపణి లాంచరు

ఈ క్షిపణులు పై క్షిపణులలాగే బరువు, వేగమూ కలిగి ఉంటాయి. కానీ పరిధి 1,000 కి.మీ. కంటే తక్కువ ఉంటుంది. గైడెన్స్ వ్యవస్థలు వివిధ రకాలుగా ఉంటాయి.

ఉదాహరణలు

  • Apache  
  • AGM-158 JASSM   అమెరికా
  • Babur   పాకిస్తాన్
  • KD-63   చైనా
  • Popeye turbo ALCM   ఇజ్రాయిల్
  • Ra'ad ALCM   పాకిస్తాన్
  • Raad   ఇరాన్
  • Storm Shadow/SCALP  / /  UK / ఫ్రాన్సు / Italy
  • Taurus KEPD 350  / /  జర్మనీ/ స్వీడన్/ స్పెయిన్

తక్కువ పరిధి, సబ్‌సోనిక్ మార్చు

ఇవి 500 కి.గ్రా. బరువు కలిగి, 300 కి.మీ. పరిధి కలిగిన క్షిపణులు

 
నార్వే నేవీకి చెందిన క్రూయిజ్ క్షిపణి

ఉదాహరణలు:

  • AVMT-300   Brazil
  • C-801   చైనా
  • C-802   చైనా
    • C-602   చైనా
  • Delilah missile   ఇజ్రాయిల్
  • Gabriel IV   ఇజ్రాయిల్
  • Hae Sung   Korea
  • Kh-35   రష్యా
  • P-15 KN-1   రష్యా
  • Silkworm KN-1   చైనా
  • Nasr-1   ఇరాన్
  • Naval Strike Missile   Norway
  • Zarb   పాకిస్తాన్
  • Noor   ఇరాన్
  • Qader   ఇరాన్
  • RBS-15   Sweden
  • RGM-84 Harpoon   అమెరికా
  • Silkworm   చైనా
  • SOM (missile)   టర్కీ[18][19]
  • Zafar   ఇరాన్

మోహరింపు మార్చు

 
AGM-129 ACM being secured on a B-52H bomber

క్రూయిజ్ క్షిపణుల గురి సాధారణంగా నౌకలు, బంకర్లు, వంతెనలు, డ్యాములూ వంటి అధిక విలువ గల లక్ష్యాలపై ఉంటుంది [20] ఆధునిక గైడెన్స్ వ్యవస్థలు, లక్ష్యంపై అధిక కచ్చితత్వంతో దాడి చేసేందుకు ఉపయోగపడతాయి.

References మార్చు

  1. "Hypersonic version of Brahmos on the way". The Times Of India. October 9, 2011.
  2. "Shaurya surfaces as India's underwater nuclear missile - 1 - National News – News – MSN India". Archived from the original on 2012-03-27. Retrieved 2016-11-05.
  3. "Shaurya surfaces as India's underwater nuclear missile". Business Standard News.
  4. http://www.ibtimes.com/russias-secret-hypersonic-nuclear-missile-yu-71-can-breach-existing-missile-defense-1987590
  5. http://www.ibtimes.co.uk/china-successfully-tests-7000-mph-df-2f-hypersonic-missile-says-pentagon-source-1557121
  6. http://www.popularmechanics.com/military/research/a20604/china-successfully-tests-hypersonic-weapon-system/
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-19. Retrieved 2016-11-05.
  8. "Supersonic Stealth Missile". Retrieved 8 October 2015.
  9. "Janes - Perseus: MBDA's missile of the future?". Archived from the original on 2011-11-13. Retrieved 2016-11-05.
  10. "International Institute for Strategic Studies - IISS". Archived from the original on 28 జూన్ 2012. Retrieved 8 October 2015.
  11. "New British missile three times as fast as current weapons". Telegraph.co.uk. 21 June 2011. Retrieved 8 October 2015.
  12. "MBDA Systems" (PDF). Archived from the original (PDF) on 2013-05-12. Retrieved 2016-11-05.
  13. "PARIS: Perseus set to go on the attack". Flightglobal.com. Retrieved 8 October 2015.
  14. Administrator. "Iran will unveil its new home-made cruise missile Meshkat in the near future 0909128 - September 2012 new army military defence industry - Military army defense industry news year 2012". Retrieved 8 October 2015.
  15. Ümit Enginsoy. "BUSINESS - Turkey aims to increase ballistic missile ranges". Hurriyetdailynews.com. Retrieved 2012-02-13.
  16. "TÜBİTAK: Hedefimiz 2 bin 500 kilometre menzilli füze yapmak - Hürriyet EKONOMİ". Hurriyet.com.tr. 2012-01-14. Retrieved 2012-02-13.
  17. "Türk Füzesi SOM İçin Geri Sayım Başladı - Haber - TRT Avaz". Trt.net.tr. Archived from the original on 2013-05-10. Retrieved 2012-02-13.
  18. "Yerli seyir füzesi, 180 kilometreden hedefini vuracak - Hürriyet Gündem". Hurriyet.com.tr. Retrieved 2012-02-13.
  19. "Yerli seyir füzesi, 180 kilometreden hedefinin vuracak - Kirpi HABER Cesur | Özgür | Tarafsız Habercilik". Kirpihaber.com. Archived from the original on 2011-06-07. Retrieved 2012-02-13.
  20. Communications, Raytheon Corporate. "Raytheon: Tomahawk Cruise Missile". www.raytheon.com. Retrieved 2016-09-19.