నిర్మల్ రాణి
నిర్మల్ రాణి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
నిర్మల్ రాణి | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | కుల్‌దీప్ శర్మ | ||
---|---|---|---|
తరువాత | దేవేందర్ కడ్యన్ | ||
నియోజకవర్గం | గనౌర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రాజకీయ జీవితం
మార్చునిర్మల్ రాణి హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి హెచ్‌జేసీ (బిఎల్) అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. ఆమె ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ శర్మ చేతిలో 7,543 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
నిర్మల్ రాణి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ శర్మపై 10,280 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమెకు 2024 ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.[4]
మూలాలు
మార్చు- ↑ The Tribune (3 March 2023). "Best MLA award for Gannaurs Nirmal Rani, NIT Faridabads Neeraj Sharma" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ The Indian Express (15 November 2019). "Haryana elections: Almost half the new MLAs first-timers, some trounced big names to enter House" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (11 September 2024). "BJP drops 7 MLAs in 2nd list of 21 for Haryana assembly elections; fields Captain Yogesh Bairagi against Congress' Vinesh Phogat from Julana". Retrieved 29 October 2024.