నివారణ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నివారణ (Prevention) ఒక వ్యాధి, ప్రమాదం మొదలైన బాధలు కలుగకుంటా జాగ్రత్త వహించడం.
- వ్యాధి నివారణలో కొన్ని వ్యాధులు రాకుండా ముందుగా టీకాలు తీసుకుంటాము. అంటువ్యాధులు వ్యాపించకుండా వ్యాధిగ్రస్తుల్ని వేరుగా ఆసుపత్రులలో ఉంచి వైద్యం చేస్తాము. చేతులు శుభ్రం చేసుకోవడం వ్యాధి నివారణలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
- ప్రాథమిక నివారణ : వ్యాధి పూర్తిగా రాకుండా జాగ్రత్త తీసుకోవడం. ఉదాహరణ: ఆరోగ్య పరిరక్షణ విధానాలు
- ద్వితీయ నివారణ : వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించడం, అందుమూలంగా వాటి తీవ్రత పెరగకుండా జాగ్రత్త వహించవచ్చును.
- తృతీయ నివారణ : నిర్ధారించబడిన వ్యాధులనుండి త్వరగా కోలుకొనే విధానాలు, ఇతర కష్టాలు కలుగుకుండా జాగ్రత్త వహించడం>
- రహదారి ప్రమాదాలు జరుగకుండా రహదారి నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్టు ధరించడం ప్రధానమైనవి. అగ్ని ప్రమాదాలలో మంటలు వ్యాపించడాన్ని నిరోధించడం అతి కీలకమైనది.
- నేరాలు జరుగకుండా నివారించే పద్ధతులు పాటించి మనల్ని రక్షించుకోవచ్చును.
- కొన్ని పరికరాలు ఎక్కువకాలం పనిచేయడానికి వాటికి నిర్ణీత కాల వ్యవధిలో నివారణ చర్యలు తీసుకోవలసి వుంటుంది.