నిషాదం
నిషాదం ఇది ఒక తెలుగు కవితల పుస్తకం, నిషాదం అనగా ఏనుగు ఘీంకారం అని అర్దం. ఈ పుస్తకాన్ని వేగుంట మోహన్ ప్రసాద్ వ్రాసారు. మొహన్ ప్రసాద్ కలం పేరు "మో". ఈ నిషాదంలో ఇంచుమించు 70 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ క్రమం మొదలై రెండు దశాబ్దాలు ముగిసాయి. రెండో దశాబ్దంలో తెలుగు సమాజ సంక్షోభం మొత్తం ఈ సంపుటిలో ఉంది. ఒక దశాబ్ది కవిత్వాన్ని నిషాదంగా సంపుటీకరించాడు. గానకళకు పునాది సప్త స్వరాలు. అందులో నిషాదం సప్తమ స్వరం. ఏనుగు ఘీంకారమే నిషాదంగా జనించిందని గాన కళాబోధిని వివరిస్తోంది. కవిత్వ కళాబోధిని మనకెటూ లేదు కనుక సంగీత శాస్త్ర పరిభాషా పదాన్ని కవిత్వానికి అనవయించుకోవటం కొత్తే. సప్త స్వరాలలో రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదాలకు రెండేసి భేదాలుంటాయి. వీటిని వికృతి స్వరాలంటారని కవిత్వ కళాబోధిని అంటోంది. షడ్జమ, పంచమ స్వరాలకు వికృతి భేదం లేదు కనుక అవి ప్రకృతి స్వరాలు. "నేను వికృతి స్వరంలో పాడుతున్నాను ఈ సమాజ వికృతాన్ని, దుష్కృతాన్ని, దష్మృత్యాన్ని, దురాగతాన్ని, దుర్మార్గాన్ని" అని కవి ఈ పుస్తకంలో అంటున్నాడు.
చరిత్ర
మార్చునిషాదం అనే పుస్తకాన్ని వెగుంట మొహన్ ప్రసాద్ "మో" అనే కలం పేరుతో వ్రాసారు. నిషాదం మొదటి సంచిక డిసంబర్ 2010 లో విడుదలైంది. ఈ పుస్తకాన్ని విరి వాల్యుమ్స్ పబ్లిష్ చేసారు.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- http://kinige.com/kbook.php?id=120 Archived 2011-05-28 at the Wayback Machine
- ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన సమీక్ష-http://pustakam.net/?p=7717