నిహాన్ హిదాంక్యో
నిహాన్ హిదన్క్యో, లేక జపాన్ అటామిక్, హైడ్రోజన్ బాంబు బాధితుల సంస్థల కూటమి, అనేది 1956లో ప్రారంభించిన జపనీస్ సంస్థ. ఇది అణు, పరమాణు బాంబుల బాధితులు (హిబాకుషా) ఈ సంస్థను స్థాపించారు. దీని లక్ష్యాల్లో జపనీస్ ప్రభుత్వాన్ని అణ్వాయుధాల బాధితులకు మెరుగైన సాయం చేయడానికి, ప్రభుత్వాలను న్యూక్లియర్ బాంబులను నిర్మూలించడానికి ఒత్తిడి చేయడం ముఖ్యమైనవి.[1]
Founded | 1956 అక్టోబరు 10 |
---|---|
Focus | అణ్వాయుధాల విముక్తి |
కేంద్రస్థానం | షిబడైమాన్, మినాటో, టోక్యో |
Area served | జపాన్ |
Method | లాబీయింగ్ |
సంస్థ కార్యకలాపాల్లో వేలాదిమంది ప్రత్యక్ష సాక్షుల కథనాలు స్వీకరించి అందించడం, అంతర్జాతీయ అణ్వాయుధ నిర్మూలనకు అనుకూలంగా తీర్మానాలు, అప్పీళ్ళూ చేయడం, ఐక్యరాజ్య సమితితో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు ఏటా ప్రతినిధులను పంపడం వంటివి ఉన్నాయి.[2]
ఈ సంస్థకు "అణ్వాయుధాల వాడకంలో ప్రత్యక్ష సాక్షుల దృష్టాంతాల ద్వారా అణ్వాయుధాలు తిరిగి ఉపయోగించకూడదని, అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని రూపుదిద్దాలని ప్రదర్శించే" పని చేస్తున్నందుకు 2024లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.[2]
గౌరవాలు
మార్చు- 2010: సామాజిక క్రియాశీలతకు అవార్డు (నోబెల్ శాంతి గ్రహీతల ప్రపంచ శిఖరాగ్ర సమావేశం)
- 1985, 1994, 2015: స్విట్జర్లాండ్లో నెలకొన్న అంతర్జాతీయ శాంతి బ్యూరో (IPB) హిడన్కోను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది.[3][4]
- 2024 నోబెల్ శాంతి బహుమతి
మూలాలు
మార్చు- ↑ "Welcome to HIDANKYO". Japan Confederation of A- and H-Bomb Sufferers Organization (Nihon Hidankyo) website. Retrieved 2007-08-31.
- ↑ 2.0 2.1 Royen, Ulrika (2024-10-11). "Press release". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-11.
- ↑ Ne.jp
- ↑ Atomic bomb survivors nominated for Nobel prize | The Japan Times. They were awarded the Nobel Peace Price in 2024.