నోబెల్ శాంతి బహుమతి

ఐదు నోబెల్ బహుమతులలో ఒకటి

డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఆరు అవార్డులలో ఒకటి నోబెల్ శాంతి బహుమతి. ప్రతి సంవత్సరం శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఔషధరంగం అనే ఆరు రంగాలలో ఎవరైతే వారి చర్యల ద్వారా మానవజాతికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తారో వారికి ఈ సంస్థ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇతర నోబెల్ బహుమతులు స్వీడన్ లో ఇవ్వబడుతుండగా, నోబెల్ శాంతి బహుమతి నార్వేలో ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ బహుమతులు ప్రారంభించినప్పుడు నార్వే, స్వీడన్ ఒక దేశంగా ఉన్నాయి.[1]

నోబెల్ శాంతి బహుమతి
A golden medallion with an embossed image of a bearded man facing left in profile. To the left of the man is the text "ALFR•" then "NOBEL", and on the right, the text (smaller) "NAT•" then "MDCCCXXXIII" above, followed by (smaller) "OB•" then "MDCCCXCVI" below.
వివరణశాంతి కోసం విశేష కృషి చేసినందుకు
Locationఓస్లో
అందజేసినవారుఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క ఎస్టేట్ తరపున నార్వేజియన్ నోబెల్ కమిటీ
మొదటి బహుమతి1901
వెబ్‌సైట్Nobelprize.org
ఓస్లో, నార్వేలో నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్

దీని విజేతల జాబితాలో మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్, ఎలిహు రూట్, థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, హెన్రి లా ఫోంటైన్, మిఖాయిల్ గోర్బచేవ్, ఆంగ్ సాన్ సు కయి, నెల్సన్ మండేలా, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్, వంగారి మాతై, బరాక్ ఒబామా, లియు క్సియాబో సహా పలువురు ఉన్నారు. ఈ బహుమతి అవార్డు విషయంలో తరచుగా వివాదం జరుగుతుంటుంది.

2013 లో రసాయన ఆయుధాల నిషేధం కొరకు పనిచేస్తున్న సంస్థ విజేతగా నిలిచింది. 2014 లో భారతదేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ సంయుక్తంగా ఈ నోబుల్ శాంతి బహుమతిని గెలుపొందారు.

1948లో నోబెల్‌ శాంతి బహుమతిసవరించు

1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయినారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఒక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు.

1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతిసవరించు

శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు.బహుమతి గ్రహీతలకు మర్యాద పూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 నిధులను భారతదేశం లోని పేద ప్రజలకు ఇవ్వవలసినదిగా కోరుతూ, భౌతికపరమైన బహుమతులు ప్రపంచంలోని అవసరార్ధులకు ఉపయోగపడినపుడే వాటికి ప్రాముఖ్యత వుంటుంది అన్నారు.మదర్ థెరీసా ఈ బహుమతిని అందుకున్నపుడు ఆమెను "ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం?" అని అడిగారు."ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని చెప్పారు.ఈ విషయం పై ఆమె తన నోబెల్ ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు:"పేద దేశాలలోనే కాక ప్రపంచం మొత్తంలో నేను పేదరికాన్ని చూసాను, కానీ పాశ్చాత్య దేశాలలోని పేదరికం తొలగించడం కష్టం.నేను వీధులలో ఆకలిగొన్న వానిని కలిసినపుడు అతనికి కొంత అన్నము, ఒక రొట్టెముక్క ఇచ్చి తృప్తిపడతాను. నేను అతని ఆకలిని తొలగించగలిగాను.కానీ ఒక వ్యక్తి గెంటివేయబడినపుడు, పనికిరాని వ్యక్తిగా భావించబడినపుడు, ప్రేమింపబడనపుడు, భీతిల్లినపుడు, సమాజంచే వెలివేయబడినపుడు-ఆ రకమైన పేదరికం చాల బాధాకరమైనది, నా దృష్టిలో తొలగించుటకు కష్టమైనది." గర్భ స్రావాన్ని 'ప్రపంచ శాంతికి అతి పెద్ద విఘాతంగా' ఆమె పేర్కొన్నారు.

మూలాలుసవరించు

  1. "Nobel Peace Prize", The Oxford Dictionary of Twentieth Century World History