నీరా తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు కర్జూర, జీరిక చెట్ల నుంచి ఉత్పత్తి అవుతుంది. నీరా ఆల్కహాలు లేని సహజసిద్ధమైన ఆరోగ్యద్రావణం. ఎన్నో రకాల ఔషధగుణాలున్న నీరా ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్యప్రదాయిని. నీరా సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్‌గానే కాకుండా జీర్ణకోశ సంబంధితమైన ఒక ఔషధంలా కూడా పనిచేస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలకు దూరం చేస్తుంది. కంటిచూపును చాలా వరకు మెరుగుపరుస్తుంది. నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ ఇమ్యూనిటీని రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తాయి. నీరాలో ఉన్న అనేకమైన మినరల్స్ వల్ల రక్తకణాలు వేరుపడతాయి. ఇందులో ప్రధానంగా సుక్రోస్ ఉండడం వల్ల డయాబెటీస్ బాధితులు కూడా నిర్భయంగా సేవించవచ్చు.[1][2][3][4]

నీరా
కొల్లం కైపుజ ప్లాంట్ నందు తయారు చేసిన నీరా పానీయం
Ingredientsతాటి కల్లు కలిసిన మిశ్రమ పానీయం

నీరా ఉపయోగాలు మార్చు

నీరా రుచికరమైన ఆరోగ్య పానీయంగా ప్రసిద్ది చెందింది. ఇది జీర్ణక్రియకు మంచిది, స్పష్టమైన మూత్రవిసర్జనను సులభతరం చేస్తుంది, కామెర్లు నివారిస్తుంది. పోషకాలు అధికంగా ఉండే "సాప్" లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (కేవలం 35 యొక్క జిఐ) ఉంది, అందువల్ల చక్కెర చాలా తక్కువ మొత్తంలో రక్తంలో కలిసిపోతుంది కాబట్టి డయాబెటిక్-స్నేహపూర్వకంగా ఉంటుంది. ఇది ఖనిజాల సమృద్ధిగా ఉంది, 17 అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, బ్రాడ్-స్పెక్ట్రం బి విటమిన్లు, దాదాపు తటస్థ పిహెచ్ కలిగి ఉంటాయి. కొబ్బరి స్ఫటికాలను ఈ స్వచ్ఛమైన, తక్కువ గ్లైసెమిక్ సహజ సాప్ నుండి తయారు చేయవచ్చు. చాలా గోధుమ చక్కెరను 221 డిగ్రీల ఎఫ్ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టి, తుది ఉత్పత్తితో 93% సుక్రోజ్, సాప్ స్ఫటికాలలో 0.5% గ్లూకోజ్, 1.5% ఫ్రక్టోజ్, 16% సుక్రోజ్, 82% ఇన్సులిన్ మాత్రమే ఉన్నాయి - జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రీ-బయోటిక్. దీనిని ఆదర్శవంతమైన స్వీటెనర్గా ఉపయోగించవచ్చు. కొప్రాతో పోలిస్తే నీరా మెరుగైన రాబడిని పొందుతుంది.[5]

నీరా ఉత్పత్తులు మార్చు

నీరా నుంచి ఔషధ విలువలున్న ఖరీదైన తాటి బెల్లం, చక్కెరను ఉత్పత్తి చేయవచ్చు. డయాబెటీస్‌ నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం విరివిగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తాటి కలకండ, తాటి షుగర్‌ క్యాండీ, తాటి పౌడర్‌తో పాటు తాటి బెల్లం పాకం కూడా తయారు చేయవచ్చు. తాటిబెల్లం పాకంతో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యాకి ఎంతో మంచిదని పరిశోధనలో తేలింది. భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో నీరా ప్లాంట్లను పైలెట్‌ ప్రాజెక్టుగా నీరా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి రూ.8కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది.[6]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, జిందగీ న్యూస్ (20 August 2018). "ఆరోగ్యప్రదాయి నీరా". Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
  2. సాక్షి, గెస్ట్ కాలమ్స్ (30 November 2019). "సహజసిద్ధ జీవనధార... 'నీరా'". Sakshi. Archived from the original on 2 December 2019. Retrieved 2 December 2019.
  3. సాక్షి, తెలంగాణ (5 January 2020). "ఆత్మగౌరవంతోపాటు ఆర్థికాభివృద్ధి." Sakshi. Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  4. Sakshi (1 January 2022). "నీరాలో కేన్సర్‌ నిరోధకశక్తి". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  5. నమస్తే తెలంగాణ, జిందగీ న్యూస్. "దేశీయ శీతల పానీయం నీరా". ntnews.com. Archived from the original on 8 January 2020. Retrieved 8 January 2020.
  6. Namasthe Telangana (3 December 2021). "నందనంలో నీరా ప్రాజెక్టు గీత కార్మికులకు మంచి రోజులు". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=నీరా&oldid=3906642" నుండి వెలికితీశారు