నీలంశెట్టి లక్ష్మీ

నీలంశెట్టి లక్ష్మీ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.[1][2]

నీలంశెట్టి లక్ష్మీ
వ్యక్తిగత సమాచారం
జననంఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా
క్రీడ
దేశంభారతదేశం
క్రీడవెయిట్ లిఫ్టింగ్
కోచ్నీలంశెట్టి అప్పన

జననం మార్చు

శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస గ్రామానికి చెందిన అప్పలనాయుడు, మల్లీశ్వరమ్మ దంపతులకు నీలంశెట్టి లక్ష్మీ జన్మించింది.[3]

క్రీడారండం మార్చు

తొలి శిక్షకుడు పినతండ్రి నీలంశెట్టి అప్పన నేతృత్వంలో 13 ఏళ్ళ వయసులోనే లక్ష్మీ జాతీయ క్రీడలలో పాల్గొన్నది. 1984 లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ప్రవేశించిన లక్ష్మీ, 1986లో జిల్లా మహిళా జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి పాల్గొన్నది.

1987లో ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్ లో జరిగిన ప్రపంచ జూనియర్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి అంతర్జాతీయ క్రీడారంగ ప్రవేశం చేసింది.

పతకాలు - విజయాలు మార్చు

  1. 1988లో కడపలో జరిగిన అంతరాష్ట్ర పోటీల్లో కాంస్య పతకం
  2. 1889లో చైనా లోని బీజింగ్ లో ఆసియా క్రీడల్లో రజత పతకం
  3. 1991 కొరియాలో జరిగిన ప్రపంచ ప్రీ క్వాలిఫైడ్ పోటీల్లో ద్వితీయ స్థానం
  4. 1992లో గోవాలో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం

వివాహం మార్చు

ప్రముఖ వెయిట్ లిప్టరైన సురేష్ తో నీలంశెట్టి లక్ష్మీ వివాహం జరిగింది. సురేష్ సి.ఐ.ఎస్.ఎఫ్. లో ఇన్సిపెక్టర్ గా పనిచేస్తున్నాడు. వీరు ప్రస్తుతం విశాఖపట్టణం లో ఉంటున్నారు.

మూలాలు మార్చు

  1. నీలంశెట్టి లక్ష్మీ, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 233. ISBN 978-81-8351-2824.
  2. ది హిందూ. "Wake up to weightlifting". Retrieved 29 April 2017.
  3. ఆంధ్రభూమి, శ్రీకాకుళం. "స్టేడియం ఆధునీకరణకు శ్రీకారం". Retrieved 29 April 2017.