నీలాలు కారేనా
నీలాలు కారేనా, కాలాలు మారేనా తెలుగు సినిమా పాట. ఇది 1981లో విడుదలైన ముద్ద మందారం సినిమాలోది. ఈ పాటకి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీతం ఆందించారు. వేటూరి సుందరరామమూర్తి గారు రచించారు. దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సినిమాలో ఈ పాటకు ప్రదీప్, పూర్ణిమ నటించారు.[1]
పాట
మార్చునీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ, జాబిల్లి వేళ
పూలడోల నేను కానా||
సూరీడు, నెలరేడు
- సిరిగల దొరలే కారులే,
పూరిగుడిసెల్లో, పేదమనస్సులో
- వెలిగేటి దీపాలులే!
ఆ నింగి, ఈ నేల
- కొనగల సిరులే లేవులే,
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో
- నిరుపేద లోగిళ్ళులే||
ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో,
కలికి వెన్నెల్లో
- కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే, ఒదిగి పోతుంటే
- కడతేరి పోవాలిలే||
మూలాలు
మార్చు- ↑ "Neelaalu kaarenaa.... | నీలాలు కారేనా.... lyrics (Muddamamdaaram 1981)| Indian Lyrics & Verse". lyricsverse.in. Retrieved 2020-08-30.
బాహ్య లంకెలు
మార్చు- నీలాలు కారేనా, కాలాలు మారేనా ముద్దమందారం సినిమా లోని పాట