నీలిమా మిశ్రా
నీలిమా మిశ్రా మెగసెసే అవార్డు గ్రహీత. మహారాష్ట్రలో నిరుపేదల రుణదాతగా పేరొందిన సామాజిక ఉద్యమకారిణి. వివాహం చేసుకోకూడదని 13 ఏళ్ల వయసులోనే నిశ్చయించుకొని జీవితాన్ని గ్రామీణ భారత సేవకు అంకితమిచ్చిన అవివాహిత. పుణేలో సైకాలజీలో పీజీ పూర్తిచేశారు. ఎనిమిదేళ్ల పాటు విజ్ఞాన్ ఆశ్రమ్ లో పనిచేశారు. ఎదుటి వాళ్లకు మనం చేసే సహాయం వాళ్లలో ఇతరులపై ఆధారపడే స్వభావాన్ని పెంచకూడదనేది నీలిమ సిద్ధాంతం. డజనుకు పైగా అవార్డులు పొందిన నీలిమ వాటి ద్వారా వచ్చిన సొమ్మును వివిధ సహాయ కార్యక్రమాలకు కేటాయించారు. మెగసెసె అవార్డు ద్వారా వచ్చే 22 లక్షలను ‘భాగిని నివేదిత గ్రామీణ్ విజ్ఞాన్ నికేతన్’ సంస్థకు కేటాయించారు. సూక్ష్మ రుణాల సాయంతో పేద మహిళలు తమ జీవితాల్ని తమంతట తామే మెరుగుపరచుకునేలా చైతన్యం నింపారు[1]. నీలిమ తన పెళ్ళి కోసం దాచిన తల్లి నగలను అమ్మి అలా వచ్చిన రూ.3 లక్షలతో నాలుగు కంప్యూటర్లు, వస్తువులను కొనుగోలు చేశారు.నీలిమ ప్రారంభించిన 'భాగిని నివేదిత గ్రామీణ విజ్ఞాన నికేతన్ (బీఎన్‌జీవీఎన్)' సంస్థ ప్రస్తుతం 10 వేల మంది మహిళలతో ముందుకు సాగుతోంది.[2] గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు, రుణ సౌకర్యాలు లేకపోవడమే పెద్ద సమస్య అని నీలిమ వాదిస్తారు. ఆమెకు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.[3]
Nileema Mishra | |
---|---|
గుర్తించదగిన సేవలు | Founder of Bhagini Nivedita Gramin Vigyan Niketan |
పురస్కారాలు | Ramon Magsaysay Award 2011 |
మూలాలు
మార్చు- ↑ "Nileema Mishra, Harish Hande win Magsaysay award". The Times of India. 27 July 2011. Archived from the original on 20 August 2013. Retrieved 9 August 2013.
- ↑ "Nileema Mishra to donate Magsaysay prize money". ummid.com. 27 July 2011. Retrieved 9 August 2013.
- ↑ "Jaymala Shiledar, Suresh Talwalkar, Milind Kamble among Padma Shri awardees". The Times of India. 26 January 2013. Archived from the original on 25 April 2013. Retrieved 10 August 2013.
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]]