నీలేష్ గిర్కర్
నీలేష్ దశరత్ గిర్కర్ హిందీ, తెలుగు సినిమా స్క్రిప్ట్ రచయిత. 2009లో రామ్ గోపాల్ వర్మ తీసిన అగ్యాత్ (2009) సినిమాతో సినిమారంగంలోకి వచ్చాడు. డిపార్ట్‌మెంట్ (2012),[1] సర్కార్ 3,[2] నానా పటేకర్ తీసిన అబ్ తక్ ఛప్పన్ 2 (2015) మొదలైన సినిమాలకు కూడా స్క్రిప్ట్ రాశాడు.
జీవిత విశేషాలు
మార్చుగిర్కర్ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. ముంబై విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. కంతకాలం ముంబైలోని మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ బిపిఓలో క్వాలిటీ అస్యూరెన్స్‌లో పనిచేశాడు.
సినిమారంగం
మార్చు2008లో బాలీవుడ్ కా బాస్ ఫిల్మీ జ్ఞాన్ క్విజ్ షో సెట్‌లో బోమన్ ఇరానీని కలిసిన తర్వాత స్క్రీన్‌ప్లే రచనపై దృష్టి సారించాడు.
స్క్రిప్ట్ రచయితగా కావడానికి ముందు మరాఠీ థియేటర్ రచయిత/దర్శకుడు దేవేంద్ర పెమ్ దగ్గర రెండు సంవత్సరాలపాటు సహాయ రచయితగా పనిచేశాడు. దేవేంద్ర పెమ్ థియేట్రికల్ నాటకం లాలి-లీలాకుపనిచేశాడు. నటుడిగా, బ్యాక్ స్టేజ్‌గా, మరాఠీ థియేటర్‌లో వివిధ ఏకపాత్ర నాటకాలకు వివిధ హోదాల్లో కూడా పనిచేశాడు.
మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ సంస్థలో పనిచేస్తున్నప్పుడే తన మొదటి స్క్రిప్ట్‌ను రాశాడు. 2009లో అగ్యాత్‌తో రామ్ గోపాల్ వర్మ డ్రీమ్‌ఫోర్స్ ఎంటర్‌ప్రైజ్‌లో తనకి గుర్తింపు వచ్చింది.
రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3 సినిమాకి తన రచన విభాగంలో క్రెడిట్స్ అందుకున్నాడు.[3]
సినిమాలు
మార్చుక్ర.సం. నం | సంవత్సరం | సినిమా | విభాగం |
---|---|---|---|
1. | 2017 | సర్కార్ 3 | కథ |
2. | 2015 | అబ్ తక్ ఛప్పన్ 2 | కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్ |
3. | 2012 | శాఖ | కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్ |
4. | 2011 | దొంగల ముఠా | కథ, స్క్రీన్‌ప్లే |
5. | 2011 | కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు | కథ, స్క్రీన్‌ప్లే |
6. | 2009 | అగ్యాత్ | వ్రాసిన వారు |
మూలాలు
మార్చు- ↑ "Court asks Ram Gopal Varma to compensate 'Sarkar 3' writer". 9 May 2017.
- ↑ "Sarkar 3 makers told to credit writer". The Hindu. 9 May 2017.
- ↑ "After a case of copyright infringement, Ram Gopal Varma to screen Sarkar 3 for writer Nilesh Girkar : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama. 20 March 2017.