నీ నవ్వే చాలు పూబంతి

నే నవ్వే చాలు పూబంది 1992 లో ఎ.ఎం.రత్నం దర్శకత్వంలో నిర్మించబడిన పెద్దరికం సినిమా లోని పాట. ఈ పాటలో జగపతి బాబు, సుకన్య లు నటించారు. ఈ పాటను భువనచంద్ర/వడ్డేపల్లి కృష్ణ రచించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్రలు గానం చేసారు. ఈ పాటకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[1]

సందర్భం మార్చు

పరశురామయ్య చిన్న కుమారుడు కృష్ణమోహన్ (జగపతి బాబు) ను ప్రేమిస్తున్నానని జానకి (సుకన్య) వెంటబడుతుంది. కృష్ణమోహన్ ఆమెను కాలేజీలో కొడతాడు. ఆమె కళాశాల ప్రిన్సిపాల్ కు పిర్యాదు చేస్తుంది. ప్రిన్సిపాల్ అతనిని జానకి ఎదురుగా మందలిస్తాడు. ఆ కోపంతో అతను హాస్టలు ఖాళీ చేసి తన యింటికి వెళ్ళి పోవాలని అనుకుంటాడు. ఆమె కూడా అతనిని వెళ్లనీయకూడదని అనుకుంటుంది. కృష్ణమోహన్ తన స్నేహితుని సలహాతో ఆమెను ప్రేమించినట్లు నటించాలని అనుకుంటాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి వారి కుటుంబంపై పగ తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశమని సుధాకర్ చెప్పిన మీదట అంగీకరిస్తాడు. ప్రేమిస్తున్నానని చెప్పడానికి పార్కులో స్నేహితులతో ఉన్న ఆమెను పిలుస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. ఆమె తన తల్లిపై ప్రమాణం చేయాలని కోరుతుంది. అతను కూడా అలానే ఆమెను అలా ఆమె తల్లిపై ఒట్టు వేసి చెప్పాలని కోరుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఆ సందర్భంలో వారి మధ్య గల యుగళ గీతం ఇది.

పాటలో కొంత భాగం మార్చు


నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక
విలాసాల దారి కాసా సరాగాల గాలమేసా
కులాసాల పూలు కోసా వయ్యారాల మాల వేసా

మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజి మొగ్గ నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా
అతివకు ఆత్రము తగదటగా
తుంటరి చేతులు విడువవుగా
మనసు పడే పడుచు ఒడి...

మూలాలు మార్చు

  1. "Nee Navve Chaalu (From "Peddarikam") (Testo) - K. S. Chithra feat. S. P. Balasubrahmanyam". MTV Testi e Canzoni. Archived from the original on 2021-06-08. Retrieved 2021-06-08.