పెద్దరికం
1992 సినిమా
పెద్దరికం 1992లో ఎ. ఎం. రత్నం దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రము. ఇందులో జగపతి బాబు, సుకన్య నాయకా నాయికలుగా నటించారు. రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
పెద్దరికం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ.ఎం.రత్నం |
---|---|
తారాగణం | జగపతిబాబు , సుకన్య |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | సూర్య చిత్ర |
భాష | తెలుగు |
కథసవరించు
అడుసుమిల్లి బసవపున్నమ్మ (భానుమతీ రామకృష్ణ), పర్వతనేని పరశురామయ్య (ఎన్. ఎన్. పిళ్ళై) కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. బసవపున్నమ్మ మనవరాలు జానకి (సుకన్య) పెళ్ళి పరశురామయ్య కుటుంబం కారణంగా చెడిపోతుంది. దాంతో బసవపున్నమ్మ వారి మీద పగ తీర్చుకోవడానికి జానకిని పరశురామయ్య చిన్న కొడుకు కృష్ణమోహన్ (జగపతి బాబు) ను ప్రేమించినట్లు నాటకమాడుతుంది. ఒకర్నొకరు అవమానించుకోవడానికి ప్రయత్నించి వారు నిజంగానే ప్రేమించుకుంటారు. దాంతో వారి రెండు కుటుంబాల మధ్య మళ్ళీ గొడవలు చెలరేగుతాయి. ఆ గొడవలను అంతా సర్దుబాటు చేసి ఆ రెండు కుటుంబాలు ఎలా కలిశాయో తెలిపేదే మిగతా కథ.
తారాగణంసవరించు
- అడుసుమిల్లి బసవపున్నమ్మ గా భానుమతి
- పర్వతనేని పరశురామయ్య గా ఎన్. ఎన్. పిళ్ళై
- బలరాముడు గా విజయ కుమార్
- కృష్ణమోహన్ గా జగపతి బాబు
- జానకి గా సుకన్య
- సాంబశివుడు గా మన్నవ బాలయ్య
- ప్రసాద్ గా సుధాకర్
- లాయరు గా అల్లు రామలింగయ్య
- లాయరు గా పరుచూరి వెంకటేశ్వరరావు
- మల్లికార్జునుడు గా నర్రా వెంకటేశ్వర రావు
- చలపతి రావు
- నరసింహం గా రామిరెడ్డి
- రామకృష్ణ గా చంద్రమోహన్
- లలిత గా కవిత
- వీరభద్రం గా ఉదయ భాస్కర్