నీ ప్రేమే నా ప్రాణం

రాజశేఖర్ దర్శకత్వం లో శ్రీహరి, నికిత రెడ్డి కథానాయక-నాయికలుగా "సంప్రీత్ సినిమా ప్రొడక్షన్స్" ఎంటర్టైన్మెంట్ పతాకంపై వై. భవాని నిర్మించిన చిత్రం నీ ప్రేమే నా ప్రాణం (2018 సినిమా). శ్రీహరి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. 2018 లో 50 రోజులు ఫంక్షన్ జరుపుకున్న మొదటి సినిమా ఇది. సముద్రం మధ్యలో హీరో పడవలో హీరోయిన్ కోసం వెతుకుతాడు. ఈ సన్నివేశానికి సుమారు 500 పడవలను ఉపయోగించారు. ఈ సన్నివేశం ప్రేక్షకుల లో మంచి అనుభూతి మిగులుస్తుంది. విశాఖపట్నం బీచ్ రోడ్ ముఖ్య ప్రదేశాలని ఈ సినిమలో తెరకి ఎక్కించారు. శ్రీహరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నటించారు. ఈ చిత్రం 13 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ హీరో శ్రీహరి నటించిన తదుపరి చిత్రం "గుండె నిండా నీ ప్రేమే" 2021 లో రిలీజ్ కాబోతుంది.డా శ్రీహరి హీరో గా , దర్యా కిస్ హీరోయిన్ గా నటించిన తదుపరి చిత్రము "ఒక యోధుడు " సినిమా రిలీజ్ కు సిద్ధమైంది .భారీ బడ్జెట్ తో నిర్మితమయిన ఈ చిత్రం తెలుగు ,తమిళ్ , హిందీ భాషల లో ఓకే సారి 2021 లో రిలీజ్ కాబోతుంది . దీనికి మ్యూజిక్ డా.శ్రీహరి అందించారు . ఈ సినిమా కు రాజశేఖర్ దర్శకత్వం వహించారు .

నీ ప్రేమే నా ప్రాణం
దర్శకత్వంరాజశేఖర్
రచనరాజశేఖర్
నిర్మాతవై. భవాని
తారాగణంశ్రీహరి,
నికిత రెడ్డి,
ధన్‌రాజ్
ఛాయాగ్రహణంA.N.Mani
కూర్పుశ్రీహరి
సంగీతంశ్రీహరి
నిర్మాణ
సంస్థ
సంప్రీత్ సినిమా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2018
సినిమా నిడివి
2.31
భాషతెలుగు
బడ్జెట్3 కోట్లు

[1][2][3][4]

కథ మార్చు

అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. అతను గతాన్ని తలచు కుంటాడు.నాలుగు సంవత్సరాల క్రితం రోడ్లమీద బికారిగా తిరిగే అతను ఈ రోజు ఇంత వున్నత స్థాయి లో ఎలా వున్నాడు? ఇతని అభివృద్ధికి కారణం "ఒక అమ్మాయి ప్రేమ" అంటు గతం వూహించుకుంటాడు. 4 సంవత్సరాల క్రితం గతం. ఓ రోజు బీచ్ లో హీరో కూర్చుని ఉంటాడు. సముద్రం తో తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు "నా తల్లి దండ్రుల నుండి చిన్నప్పుడే దూరం చేసావ్. చిన్నప్పుడు నా తల్లిదండ్రుల నుండి తప్పిపోయి అనాధగా బ్రతుకుతున్నాను. మా అమ్మ నాన్న గురించి వెతకని చోటు లేదు. మా అమ్మ నాన్న ఎక్కడ వున్నారో చెప్పు?".

అదే సమయం లో నీలు అనే అమ్మాయి (నికిత రెడ్డి) తన స్నేహితు రాలితో బీచ్ కి వస్తుంది. ఆమెని చూసి ప్రీతం (శ్రీహరి) ప్రేమ లో పడతాడు. ఆమెను అనుసరించ దానికి ప్రయత్నిస్తాడు. కానీ మిస్ అవుతుంది. ఇంటికి వచ్చి స్నేహితులతో ఈ విషయం చెపుతాడు. ప్రీతం అండ్ స్నేహితులు నీలు ని వెతకడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ నీలు దొరకదు. ప్రీతం పిచోడులా అయిపోతాడు. ఆ విధం గా 8 నెలలు గడుస్తాయి. ప్రీతం కి నీలు ధ్యాస తప్ప ఇంకోటి లేకుండా అయిపోతాడు.

మరో ప్రక్క చిన్నప్పుడు తప్పి పోయిన తల్లి దండ్రుల గురించి వెతుకుతూ ఉంటాడు.ప్రీతం. నీలు ఒక సెంట్రల్ మినిస్టర్ కూతురు. పిన్ని ఇంట్లో వుండి చదువు కుంటుంది. సింపుల్ లైఫ్ అంటే ఇష్టం. కాలేజీ లో కూడా ఆమె ఒక మినిస్టర్ కూతురు అని ఎవ్వరికి .చెప్పదు .

ప్రీతం తల్లి దండ్రుల వివరాలు గుర్తున్నంత వరకు అందరికి చెప్తూ వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తాడు. ఈ క్రమం లో అన్ని అనాధాశ్రమాలకు తన వివరాలు ఇస్తూ లెటర్స్ వ్రాస్తాడు. ఎప్ప్పుడైనా తన పేరెంట్స్ తన లాగే వెతుక్కుంటూ అనాధాశ్రమాలకు వస్తారు అని ప్రీతం ఆలోచన .

ఈక్రమం లో ప్రీతం తన ఇంట్లో ఉంటాడు. అదే సమయం లో ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది . తలుపు తీస్తాడు . తన కళ్ళను తానే నమ్మ లేక పోతాడు .ఎదురుగా నీలు .కొన్ని నిముషాలు మాటలు రావు .చాల సంభ్ర మాత్సర్యాలకి గురి అవుతాడు .

"ప్రీతం మీరేనా ? " అంటూ ప్రశ్నిస్తుంది."మీ పేరెంట్స్ ని పట్టుకునే ఒక క్లూ దొరికింది. నేను విశాఖపట్నం లో బీచ్ రోడ్ లో వుండే అనాధాశ్రమం నడుపుతున్నాను ఒక లెటర్ మీ పేరెంట్స్ నుండి వచ్చింది అంటు చెపుతుంది. మీరు మాకు రాసిన లెటర్ లో వివరాలు, మీ పేరెంట్స్ మాకు చెప్పిన వివరాలు సరిపోవడం వలన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీ పేరెంట్స్ ని కలవడానికి ట్రై చేసాను. కానీ ఫోన్ నంబర్ చేంజ్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యారు. ఈ లెటర్ రెండు సంవత్సరాల క్రితం మాకు వచ్చింది. కానీ మీ లెటర్ చూసాక తెలిసింది మీ పేరెంట్స్ వాళ్లేనని "

ఆ తరువాత నీలు ప్రీతం పేరెంట్స్ ఆచూకీ తెలుసుకోవడానికి చాల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ప్రీతం నీలు మధ్య స్నేహం ఏర్పడుతుంది .

నీలు ఫ్రెండ్ ఒక లవ్ గ్రీటింగ్ కొని ఒక కవర్ లో పెడుతుంది. నీలు ప్రీతం పేరెంట్స్ వివరాలు కనిపెడుతుంది. ఈ వివరాలు అన్ని ఒక కవర్ లో పెట్టి ప్రీతం కి ఇచ్చి సర్పైజ్ చెయ్యాలి అనుకుంటుంది. అదే సమయం లో కవర్ లు ఓకే లా ఉండటం వలన నీలు పొరపాటున లవ్ గ్రీటింగ్ వున్న కవర్ ని ప్రీతం కి ఇస్తూ " ఈ కవర్ లో నీ జీవితం ఉంది" అని చెప్తుంది.

ప్రీతం ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసేసరికి లవ్ గ్రీటింగ్ చూసి ఎగిరి గంతు వేసి డాన్స్ చేస్తాడు. విషయం స్నేహితులకి తెలిసి పార్టీ చేసుకుంటారు .

ఆ తరువాత ప్రీతం నీలు ఇంటికి వెళ్తాడు. ఆమె ఆ సమయం లో బయట ప్రక్రుతి చూస్తూ ఉంటుంది. ప్రీతం ని గమనించదు. ప్రీతం సంతోషం పట్టలేక ఒక్క సారిగా నీలుని ఎత్తుకుని తిప్పి ముద్దు పెట్టేస్తాడు.

ఈ హఠాత్ సంఘటనకి నీలు షాక్ గురి అవుతుంది. చెంప చెల్లు మనిపించి "అనాధ బుధ్ధి చుపించావ్ " అంటూ అవమానించి నౌకర్ల చేత ఇంట్లో నుండి గెంటి వేస్తుంది. ఆ తరువాత ప్రీతం చాల డిప్రెషన్ కి లోన్ అవుతాడు. ఆ తరువాత నీలు అనుకోకుండా ప్రీతం డైరీ చదువుతుంది. నీలు ప్రీతం ప్రేమలో పడుతుంది

[5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22]

బాక్సాఫీస్ మార్చు

తారాగణం మార్చు

శ్రీహరి,
నికిత రెడ్డి,
ధన్‌రాజ్

చిత్రీకరణ మార్చు

లండన్ లో చాల భాగం షూట్ చేశారు .ఇండియా లో కొంత భాగం షూట్ అయ్యింది . [23] [24] [25] [26] [27]

సంగీతం మార్చు

ఈ చిత్రానికి సంగీతం శ్రీహరి అందించారు .

పాటల జాబితా మార్చు

ఊహల్లో ఊపిరి సాంగ్ సూపర్ హిట్ అయి బాగా ప్రజాధారణ పొందింది

స్పందన మార్చు

ఈ సినిమా మంచి విజయం సాధించి 2018 లో 50 రోజుల ఫంక్షన్ జరుపుకున్న మొదటి సినిమా గా నిలిచింది

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

మూలాలు మార్చు

  1. "Nee Preme Naa Praanam". IMDb.
  2. https://www.google.com/search?q=nee+preme+naa+pranam&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwjfk_qetI7iAhXC7HMBHfX5BbMQ_AUIDigB&biw=1536&bih=750#imgrc=nevqTRFK6nGNnM
  3. https://www.google.com/imgres?imgurl=https%3A%2F%2Fimgpw.rightlinks.in%2Fuploads%2F2017%2F07%2FNee-Preme-Naa-Pranam-Telugu-Full-Movie-Watch-Online.jpg&imgrefurl=https%3A%2F%2Ftodaypkmovies.pw%2Fnee-preme-naa-pranam-telugu-full-movie-download-720p-hd%2F&docid=J9Vm2QegMHd32M&tbnid=2It6xkv4x4QvMM%3A&vet=10ahUKEwi9r6zV8qHiAhVA63MBHWw0B-oQMwhPKBIwEg..i&w=450&h=651&itg=1&bih=750&biw=1536&q=nee%20preme%20naa%20pranam&ved=0ahUKEwi9r6zV8qHiAhVA63MBHWw0B-oQMwhPKBIwEg&iact=mrc&uact=8
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  5. "Nee Preme Naa Pranam". The Times of India.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-09. Retrieved 2019-05-17.
  9. "Nee Preme Naa Pranam completes censor formalities – Telugu News". 21 November 2017.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  12. "Nee Preme Naa Pranam". The Times of India.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  14. https://hiveminer.com/User/agganoormallappahttps://hiveminer.com/User/agganoormallappa[permanent dead link]
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-18. Retrieved 2019-05-18.
  16. https://www.sbdbforums.com/post/nee-preme-naa-pranam-movie-2nd-week-super-hit-movie-rating-45-9598987?trail=450[permanent dead link]
  17. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-18. Retrieved 2019-05-18.
  18. http://telugu.cinemaprofile.com/movies/nee-preme-naa-pranam-movie-details-2017-biography-online.html#sthash.jXEvUxLs.dpbs[permanent dead link]
  19. "Nee Preme Naa Pranam completes censor formalities – Telugu News". 21 November 2017.
  20. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-18. Retrieved 2019-05-18.
  21. http://telugu.cinemaprofile.com/movies/nee-preme-naa-pranam-movie-details-2017-biography-online.html#sthash.jXEvUxLs.dpbs[permanent dead link]
  22. "Nee Preme Naa Pranam completes censor formalities – Telugu News". 21 November 2017.
  23. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  24. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-09. Retrieved 2019-05-17.
  25. "Nee Preme Naa Pranam completes censor formalities – Telugu News". 21 November 2017.
  26. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.

వెలుపలి లంకెలు మార్చు