నుపుర్ శర్మ (రాజకీయవేత్త)
నుపుర్ శర్మ (జననం 1985 ఏప్రిల్ 23) ఉన్నత విద్యావేత్త. విద్యార్థి దశ నుంచే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి.[1] న్యాయవాది.
నుపూర్ శర్మ | |||
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
| |||
పదవీ కాలం 2020 – 2022 | |||
రాష్ట్రపతి | జె.పి.నడ్డా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూ ఢిల్లీ, భారతదేశం | 1985 ఏప్రిల్ 23||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2005–2022) | ||
వృత్తి |
|
ప్రారంభ జీవితం, విద్య
మార్చు1985లో న్యూఢిల్లీలో నుపూర్ శర్మ జన్మించారు. ఆమె సివిల్ సర్వెంట్లు, వ్యాపారవేత్తల కుటుంబం నుండి వచ్చింది. మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆమె చదివారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నుపుర్ శర్మ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, అలాగే ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు.అనంతరం ఆమె లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్‌లో న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. నుపూర్ శర్మ న్యాయవాదిగా మారారు.
కెరీర్
మార్చువిద్యార్థి దశలో ఆమె సంఘ్ పరివార్ విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరారు. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా ఏబీవీపీ తరఫున ఎన్నికయ్యారు. బీజేపీలో చేరాక పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. 2015లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి ఆమె ఓడిపోయారు.
వివాదస్పదం
మార్చుఎబివిపిలో ఎనిమిదేళ్ల సమయం[2]లో 'కమ్యూనలిజం, ఫాసిజం అండ్ డెమోక్రసీ: వాక్చాతుర్యం, వాస్తవికత' అనే అంశంపై ఫ్యాకల్టీ సెమినార్‌లో ఎస్.ఎ.ఆర్. గీలానీని దూషించడం ఒక చెప్పుకోదగ్గ సంఘటన. ఆ రాత్రి ఒక టెలివిజన్ షోలో కూడా అంతే నిస్సంకోచంగా వ్యవహరించింది.[1][2][3]
నుపుర్ శర్మ భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా టెలివిజన్ చర్చలలో క్రమం తప్పకుండా చురుకుగా పాల్గొనేవారు.[4] 2022 జూన్ లో ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది.[1][5][6][7] వ్యాఖ్యల తర్వాత ఎదురువుతున్న వేధింపులు, బెదిరింపులపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసులు నుపూర్ శర్మ, ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు.[8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Abhinav Rajput (5 June 2022), "Nupur Sharma: The BJP firebrand facing party axe", The Indian Express
- ↑ 2.0 2.1 Unnati Sharma (6 June 2022), "Who is Nupur Sharma? DUSU ex-president & LSE alum now suspended by BJP for remarks on Prophet", The Print
- ↑ "Nupur Sharma: impressive past, promising future", BusinessLine, 20 January 2015, మూస:ProQuest
- ↑ Geeta Pandey (7 June 2022), "Nupur Sharma: The Indian woman behind offensive Prophet Muhammad comments", BBC News
- ↑ "After 'respect all religions' statement, BJP suspends spokespersons Nupur Sharma and Naveen Jindal", The Indian Express, 5 June 2022
- ↑ "Nupur Sharma suspended from BJP for her comments about Prophet Muhammad", Scroll.in, retrieved 6 June 2022
- ↑ Nabeela Jamil (6 June 2022), "Why the debate around the age of Aisha, the Prophet's wife, is irrelevant", Scroll.in
- ↑ "Nupur Sharma: నుపుర్ శర్మకు బెదిరింపులు.. భద్రత కల్పించిన పోలీసులు". web.archive.org. 2022-06-09. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)