సంఘ్ పరివార్, హిందూ జాతీయవాదుల సంస్థల కుటుంబాన్ని సూచిస్తుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) సభ్యులచే లేదా దాని ఆలోచనల ప్రేరణతో ఇది ప్రారంభించబడింది. సంఘ్ పరివార్ హిందూ జాతీయోద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్.ఎస్.ఎస్, అనేక చిన్న సంస్థలను ఇది కలిగి ఉంది, ఇందులోని సభ్యులు, విషయాల పరిధిలో విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. నామమాత్రంగా, వివిధ సంస్థలు సంఘ్ పరివార్ పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తాయి, వివిధ విధానాలను, కార్యకలాపాలను కలిగి ఉంటాయి.[1]

1993 ఆగస్టు 8 న చెన్నైలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై  ఇస్లాంవాదులు జరిపిన బాంబు దాడిలో మరణించిన 11 మంది సభ్యుల చిత్రం

చరిత్ర మార్చు

1960 లలో ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు, ప్రముఖ గాంధేయవాది వినోభాభావే నేతృత్వంలోని భూదాన్, భూ సంస్కరణ ఉద్యమంలో, మరో గాంధేయవాది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని సర్వోదయలో సహా భారతదేశంలోని వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలలో చేరారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు, భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యార్థుల సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సేవా భారతి, లోక్ భారతీ, దీనదయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి మొదలైన అనేక ఇతర సంస్థలకు కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తోడ్పాటునందించింది. ఆర్.యస్.యస్ స్వయం సేవకులు ప్రారంభించిన, తోడ్పాటునందించిన సంస్థలన్నింటిని కలిపి సంఘ్ పరివార్ గా పేర్కొంటారు.[2]

సభ్యత్వ సంస్థలు మార్చు

సంఘ్ పరివార్ ఈ క్రింది సంస్థలను కలిగి ఉంది (బ్రాకెట్లలో 1998 నాటి సభ్యత్వం సంఖ్యలు):

మూలాలు మార్చు

  1. Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998
  2. http://publication.samachar.com/topstorytopmast.php?sify_url=http://www.suryaa.com/showNational.asp?ContentId=12667 Archived 2012-01-17 at the Wayback Machine.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 Jelen 2002:253