నుబరాషెన్ జిల్లా
నుబరాషెన్ ఆర్మేనియాలో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది దేశ రాజధానయిన యెరెవన్ లోని దక్షిణ భాగంలో ఉన్నది. ఇది తన సరిహద్దులను మల్టియ-సెబష్టియ, కెంట్రాన్, ఎరెబుని, నుబరషెన్ జిల్లాలతో పంచుకుంటుంది.[2]
నుబరాషెన్
Նուբարաշեն | |
---|---|
Coordinates: 40°05′31″N 44°32′57″E / 40.09194°N 44.54917°E | |
దేశం | ఆర్మేనియా |
జిల్లా | యెరెవాన్ |
కనుగొన్నది | 1932 |
Government | |
• జిల్లా మేయరు | టరోన్ మర్గారియన్[1] |
విస్తీర్ణం | |
• Total | 18 కి.మీ2 (7 చ. మై) |
జనాభా (2011 గణాంకాలు) | |
• Total | 9,561 |
• జనసాంద్రత | 530/కి.మీ2 (1,400/చ. మై.) |
Time zone | UTC+4 (AMT) |
అవలోకనం
మార్చుఇది యెవెరన్ నగరంలోని 8.07% భూభాగం అనగా 18 చ.కి. వైశాల్యంలో ఉంది. నుబరాషెన్ వైశాల్యపరంగా యెరెవన్ లో 5వ అతిపెద్ద జిల్లా. ఇది సెంట్రల్ యెరెవన్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నుబరాషెన్ సెంట్రల్ పార్కు, సమీపంలోని గివోడ్ అలిషన్ №85 పాఠశాల (1932లో ప్రారంభమైంది) జిల్లా మధ్య భాగంలో ఉన్నాయి. నగరంలోని తూర్పు భాగంలోని సగాన్ని నుబరాషెన్ ఒక పెద్ద సైనిక స్థావరం ఆక్రమించింది . 2016, జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 9,800 మంది నివసిస్తున్నారు.
చరిత్ర
మార్చుఅర్మేనియాను సోవియంట్ దేశాలలో కలిపినప్పుడు, ఆర్మేనియన్ జనరల్ సహనశీలి యూనియన్ (ఎజిబియు) కు మాత్రమే ఆర్మేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ను వాడుకునే అనుమతి ఉన్నది, దీనిని ఎజిబియు 1923లో మంజూరు చేసింది. 1926 లో, ఫిలడెల్ఫియా సమావేశం సమయంలో ఆర్మేనియన్ జనరల్ సహనశీలి యూనియన్ లోని యునైటెడ్ స్టేట్స్ శాఖలు, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాలో ఒక కొత్త నివాసస్థల దిగంతవ ఆర్మేనియన్ శ్రేయోభిలాషి బొఘోస్ నుబార్ కు గుర్తుగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
1931 ఏప్రిల్ 30న ఎజిబియు సంస్థ ప్రారంభించిగాను 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రాజక్టుకు US$250,000లను వెచ్చించారు. న్యూ యార్క్ నగరంలో నివసిస్తున్న అర్మేనియన్లు $102,000 , చికాగోలో నివసిస్తున్న వారు $25,000లను విరాళ రూపంలో ఇచ్చారు. అయితే 1929లో సంబవించిన గ్రేట్ డిప్రషన్ కారణంగా ఆ సంవత్సరాదికి $153,000లను మాత్రమే భద్రపరచగలిగారు.
జూలై 1931, దాదాపుగా 100-120 నివాస భవనాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే 1932 లో, అధికారికంగా నుబరాషెన్ స్థాపించబడింది. కొత్తగా స్థాపించబడిన నగరంలోని మొదటి నివాసితులు గ్రీస్, బల్గేరియా, ఫ్రాన్స్, లెబనాన్, సిరియాలోని మారణహోమం నుండి స్వదేశానికి పంపబడినవారు. 1989లో, జిల్లాకు తిరిగి పూర్వ నామకరణం చేయబడింది. 1996లో జరిగిన పరిపాలనవిభాగ సంస్కరణల అనంతరం అర్మేనియా ప్రభుత్వం నుబరాషెన్ కు రాజధాని పరిధిలోని జిల్లా స్థాయిని ఇచ్చారు. ఇక్కడ ఒక కర్మశాలను ప్రభుత్వం నిర్మించింది.[3]
జనాభా వివరాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 9,561 (యెరెవన్ నగరం జనాభాలోని 0.9%) మంది నివసిస్తున్నారు. 2016 అధికారిక అంచనాల ప్రకారం, 9,800తో నగరంలోని అత్యల్ప జనాభా కలిగిన జిల్లా. నుబరాషెన్ లో ప్రధానంగా అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికు చెందిన అర్మేనియన్లు ఉంటారు. ఈ జిల్లాలో ఆర్మేనియన్ జెనోసైడ్ యొక్క 100 వ వార్షికోత్సవానికి గుర్తుగా పవిత్రమయిన అమరవీరుల చర్చిను 2015 ఏప్రిల్ 25లో ప్రారంభించారు. ఈ నిర్మాణం 2012 లో ప్రారంభించబడి 2015లో పూర్తయింది. ఈ చర్చిను ఆర్కిటెక్ట్ అర్తక్ గుల్యన్ డిజైన్ చెయ్యగా నిధులు గాగిక్ సారుక్యన్ దానంగా ఇచ్చారు.
సంస్కృతి
మార్చునుబరాషెన్ సంగీత పాఠశాలను 1935 లో ప్రారంభించారు, అయితే నుబరాషెన్ లైబ్రరీ №34 1936 నుండి ఆపరేటింగ్ లో ఉంది.
జిల్లాలో అనేక కట్టడాలు ఉన్నాయి, అవి:
- 2వ ప్రపంచ యుద్ధం స్మృతి, 1973 లో నిలబెట్టారు,
- గీవోంట్ అలీషన్ యొక్క బష్ట్, 2004 లో ప్రారంభించారు,
- కఖ్ఖార్ మెమోరియల్ నాగోర్నో-కరబఖ్ యుద్ధం బాధితుల కోసం నిర్మించారు.[4]
రవాణా
మార్చునుబరాషెన్ రోడ్డు జిల్లా నుంచి యెరెవన్ ను కలిపే ప్రధాన యాక్సెస్ రహదారి, ప్రధానంగా ఎరబుని జిల్లా ద్వారా. నుబరాషెన్ కు సమీపంలోని గ్రామం జ్రాషెన్ నుండి నేరుగా రహదారి ఉన్నది, ఇది జిల్లాకు నైరుతి దిక్కున ఉంది.
విద్య
మార్చు2016-17 నాటికి, నుబరాషెన్ లో రెండు ప్రభుత్వ విద్య పాఠశాలలు, అలాగే 2 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
అంతర్జాతీయ సంబంధాలు
మార్చునుబరాషెన్ యొక్క పరిపాలన సహకారం ఒప్పందం 2015 నుండి అధికారికంగా:
References
మార్చు- ↑ "Female Legislator Attacked In Brawl Over Yerevan Sewage Water". Radiofree Europe. Retrieved 27 June 2018.
- ↑ Nubarashen district at Yerevan city official website
- ↑ "Applause at Nubarashen Prison: People are Being Released". Heqt Investigative Journalist. Archived from the original on 17 జూన్ 2018. Retrieved 27 June 2018.
- ↑ "Nubarashen Yerevan". Yerevan Municipality-Official Website. Retrieved 27 June 2018.
- ↑ Yerevan official website, Partner cities