నూజివీడు కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం, నూజివీడులో ఉంది.ఇది విజయవాడకు 50 కి.మీ. దూరంలో ఏలూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది.ఈ కోటను మేకా కుటుంబానికి చెందిన జమీందార్లు నిర్మించారని తెలుస్తుంది.18వ శతాబ్థంలో బ్రిటీసు పాలకులను ఎదురొడ్డిన నరసింహ నారయ్యప్పారావు నూజివీడును రాజధానిగా చేసుకొని, ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా తెలుస్తుంది.[1] నూజివీడును పరిపాలించిన మేకా వంశస్థులలో ఇతను 13 వ తరానికి చెందినవాడు. ఇతనిని నారయ్య అప్పారావు అనికూడా అంటారని తెలుస్తుంది.[1]

నూజివీడు కోట ప్రవేశ మార్గం

కోట నిర్మాణం చేసిన స్థలం వెనుక చరిత్ర మార్చు

 
మేకా వంశీయులకు చెందిన వేంకట రంగయ్య అప్పారావు.

ఈ కోట స్థలం స్థాపన వెనుక రెండు వృత్తాంతాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక వృత్తాంతం ప్రకారం, కోటకు చెందిన ఒక అధిపతి తన కుక్కలతో వేట కోసం ఒక గ్రామానికి వచ్చాడు. అతను వేటలో ఉన్నప్పుడు, తన కుక్కలను చిన్న జంతు జాతికి చెందిన కుందేళ్ళు వెంబడించడం అతనిని ఆశ్చర్యానికి గురిచేసింది! నిశితంగా కుందేళ్ళ ధైర్యానికి కారణం గురించి అతను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దానికి కారణం ఈ మట్టిలోని శక్తిని గ్రహించి, తన కోటను అక్కడ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.ఈ కథను వర్ణిస్తూ కోటలో "కుక్కలగేటు" అనే పేరుతో నిర్మించబడింది.

ఇంకొక వృత్తాంతం ప్రకారం, ఒక శుభదినాన అతను వేట విహారయాత్రకు బయలుదేరి వెళుతూ నువ్వులు నూనె విత్తనాల క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఒక మేక తనపై చేసిన తోడేలు దాడులకు వ్యతిరేకంగా చాలా కోపంగా పోరాడి తనను తాను రక్షించుకుంటోంది.ఆ సంఘటన రాజా మంచి శకునంగా భావించి, బలహీనమైన ఒక జంతువు మరొక శక్తివంతమైన జంతువుతో విజయవంతంగా ప్రతిఘటించిందని గమనించి,ఈ వాతావరణం, ఆ ప్రాంతం నేలలోని మట్టిలో ఏదో శక్తివంతమైన కారణాల ఉన్నవని భావించి అక్కడికక్కడే అతను తన కోటను నిర్మించాడు.ఆ ప్రదేశానికి (నువ్వుల నూనె సీడ్ ప్లాంట్ ప్రదేశం) నూజ్విల్వీడ్ పేరును పెట్టినట్లుగా తెలుస్తుంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "నూజివీడు నరసింహం నారయ్యప్పారావు". web.archive.org. 2019-10-22. Archived from the original on 2019-10-22. Retrieved 2019-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇవి కూడా చూడండి మార్చు

వెలుపలి లంకెలు మార్చు