కుందేలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కుందేలు (ఆంగ్లం: Rabbit) కుటుంబానికి చెందిన క్షీరదాలు. జీవశాస్త్రంలో ఇవి లాగొమార్ఫా వర్గంలో లెపోరిడే అనే కుటుంబానికి చెందినవిగా వర్గీకరింపబడినాయి. వీటిలో అనేక రకాలున్నాయి.
కుందేలు | |
---|---|
![]() | |
ఒక విధమైన కుందేలు (Sylvilagus audubonii) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | లెపోరిడే
in part |
Genera | |
పెంటాలాగస్ |
శరీర నిర్మాణంసవరించు
కుందేళ్ళలో ఆహారం అధికంగా పెద్దప్రేవులలో జీర్ణమౌతుంది. వీటిని hindgut digesters అంటారు. కనుక వీటి పెద్ద ప్రేవు వీటి కడుపుకంటే సుమారు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. వీటి గుదద్వారంలోనుండి వచ్చే "Cecotropes" లేదా "night feces" అనే పదార్ధంలో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రొటీనులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కుందేళ్ళు వీటిని కొంతవరకు తింటాయి. ఇలా కుందేళ్ళు వాటికి అవసరమైన కొన్ని ముఖ్యపోషక పదార్ధాలను అవే స్వయంగా ఉత్పాదన చేసుకొంటాయి.[1]
కుందేళ్ళకు రెండు జతల కుంతకాలు, ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కనుక వీటిని rodents అని పొరపడుతుంటారు.[2]
- కుందేలుకు, చెవుల పిల్లికి తేడాలు.
చెవుల పిల్లిని ఆంగ్లంలో hare అంటారు. కుందేలు, చెవుల పిల్లి మధ్య చాలా పోలికలున్నాయి. కాని కుందేలుకంటే చెవులపిల్లి సైజు పెద్దగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు చెవులపిల్లి చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి. కుందేలు పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉండవు, వాటికి కళ్ళు కనపడవు (altricial). కాని చెవుల పిల్లి పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉంటాయి, చూపు ఉంటుంది (precocial). ఎక్కువ జాతులు కుందేళ్ళు (cottontail rabbit మినహాయించి) నేల అడుగున బొరియలలో ఉంటాయి. చెవుల పిల్లులు మాత్రం భూమిమీద గూళ్ళలో ఉంటాయి. చెవులపిల్లి బొచ్చుమీద నల్లని గుర్తులుంటాయి. కుందేళ్ళను పెంపుడు జంతువులుగా వాడుతారు. చెవుల పిల్లలను పెంచరు.
కుందేళ్ళ జాతులుసవరించు
ఇవి బరువును బట్టి 3 రకాలు. అవి [3]
ఎక్కువ బరువున్న జాతులు
- బరువు 4నుండి 6 కిలోలు
- తెల్ల (వైట్) జైంట్
- బూడిద రంగు ( గ్రే ) జైంట్
- ఫ్లెమిష్ జైంట్
మధ్యరకపు బరువున్న జాతులు
- బరువు 3 నుండి 4 కిలోలు
- న్యూజిలాండ్ వైట్ (తెల్లని)
- న్యూజిలాండ్ రెడ్ (ఎర్రని)
- కాలిఫోర్నియన్
తక్కువ బరువు ఉండే జాతులు
- బరువు 2 నుండి 3 కిలోలు
- సోవియట్ చిన్ చిల్లా
- డచ్
కుందేళ్ళ లక్షణాలుసవరించు
- ఆరోగ్యకరమైన కుందేళ్ళ లక్షణాలు
- ఆరోగ్యకరమైన మెరిసే బొచ్చు
- చాలా చలాకీగా ఉండడం
- పూర్తిగా, తొందరగా ఆహారాన్ని తినడం
- కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఏ విధమైన స్రావాలు లేకుండా ఉండడం
- క్రమేణా బరువు పెరుగుట
- అనారోగ్యముగావున్న కుందేళ్ళ లక్షణాలు[3]
- నిస్తేజంగా, నీరసించి ఉండడం
- శారీరక బరువు కోల్పోవడం, కృశించిపోవడం
- ఎక్కువగా బొచ్చు ఊడిపోవడం
- చలాకీగా లేకపోవడం. కాని మామూలుగా, ఎప్పుడూ బోనులో ఒక నిర్ధష్టప్రదేశంలోనే గడపడం
- నీరు, శ్లేష్మంలాంటి స్రావాలు కంటి నుండి, ముక్కు నుండి, మలద్వారం, నోటి నుండి స్రవించట.
- శారీరక ఉష్ణోగ్రతలో, శ్వాసలో పెరుగుదల
జీవనం, ఆవాసంసవరించు
కుందేళ్ళు ముఖ్యంగా నేల మీద నివసించే జంతువులు. ఎడారులలో నైనా, ఉష్ణమండల అరణ్యాలలోనైనా, చిత్తడి నేలలోనైనా జీవిస్తాయి.
ఆహారపు అలవాట్లుసవరించు
కుందేళ్ళు పూర్తిగా శాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలనూ ఆహారంగా తీసుకుంటాయి.
ఆహారంగా, బట్టల్లోసవరించు
ఐరోపా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాలు, చైనా మొదలైన దేశాల్లో కుందేలును మాంసాహారంగా తింటారు. మాంసం కోసం వేటిని వేటాడుతారు. అడవి కుందేళ్ళను వేటాడటానికి ముఖ్యంగా వేట కుక్కలను, తుపాకీలను వాడతారు. కొన్ని చోట్ల వీటిని మాంసం కోసమే పెంచుతారు. దీన్ని క్యూని కల్చర్ అంటారు. దీని మాంసంలో మంచి నాణ్యతగల ప్రోటీన్లు లభిస్తాయి. అందుకనే దీని మాంసానికి మార్కెట్లో మంచి డిమాండు ఉంటుంది.
పర్యావరణ సమస్యలుసవరించు
మానవులు వీటిని అడవుల్లో వదలడం వల్ల ఇవి కొన్ని పర్యావరణ సమస్యలను కూడా సృష్టిస్తున్నాయి. వీటికుండే విపరీతమైన ఆకలి వల్ల, సంతానం వేగంగా వృద్ధి చెందడం వల్ల వ్యవసాయానికి ముప్పు కలుగుతుంది.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ Dr. Byron de la Navarre's "Care of Rabbits" Susan A. Brown, DVM's "Overview of Common Rabbit Diseases: Diseases Related to Diet"
- ↑ Brown, Louise (2001). How to Care for Your Rabbit. Kingdom Books. p. 6. ISBN 9781852791674.
- ↑ 3.0 3.1 3.2 ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]
బయటి లింకులుసవరించు
- అమెరికా కుందేలు పెంపకందారుల సంఘం
- ఇళ్ళలో కుందేళ్ళను పెంచేవారి సొసైటీ
- RabbitShows.com కుందేలు ప్రదర్శనలు.
- The (mostly) silent language of rabbits కుందేళ్ళ మూగ భాష
- World Rabbit Science Association కుందేళ్ళ ఆరోగ్యం గురించి అంతర్జాతీయ సంస్థ